నోట్లిస్తేనే జ‌నం ఓట్లేస్తారా..? – ప్రొ.నాగేశ్వ‌ర్ అద్భుత విశ్లేష‌ణ‌

0
463

ఏప్రిల్ 11న ఏపీ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక్కో ఎంపీ అభ్య‌ర్ధి నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్ధి వ‌ర‌కు వారి వారి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో గెలుపే ల‌క్ష్యంగా రూ.50 కోట్లు వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టార‌ని, క‌నీసం రూ.25 కోట్లు లేనిదే అస‌లు పోటీచేసేందుకు అవ‌కాశ‌మే లేదంటూ జేసీ దివాక‌ర్‌రెడ్డి సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆఖ‌ర‌కు కూలీనాలీచేసేవారు కూడా ఓటు వేయాలంటే రూ.5వేలు డిమాండ్ చేస్తున్నార‌ని జేసీ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

జేసీ అన్న ఈ వ్యాఖ్య‌లపై రాజ‌కీయ విశ్లేష‌కులు ఖండిస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు ప్రొ.నాగేశ్వ‌ర్ మీడియాతో మాట్లాడుతూ జేసీ దివాక‌ర్‌రెడ్డి చెబుతున్న‌ట్టు దేశంలోని అనేక రాష్ట్రాలో డ‌బ్బు ప్ర‌భావం ఏ మాత్రం లేద‌న్నారు. కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క‌లోనే ఈ డ‌బ్బు ప్ర‌భావం అనేది తీవ్ర స్థాయిలో ఉంద‌ని త‌న విశ్లేష‌ణ ద్వారా నాగేశ్వ‌ర్ తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో డ‌బ్బు ప్ర‌భావం నామ‌మాత్రంగా కూడా ఉండ‌దు. అందువ‌ల్ల దేశం అంత‌టా డ‌బ్బు ప్ర‌భావం ఉంద‌నుకుంటే పోర‌పాటని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఏపీ, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో రాజ‌కీయ నాయ‌కులు, బడా వ్యాపారులు, బ‌డా కార్పొరేట్ సంస్థ‌లు, కాంట్రాక్ట్ సంస్థ‌లు ద్వారా అడ్డంగా సంపాదించుకున్న వారంతా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌ని, రాజ‌కీయాల‌ను వ్యాపారంగా మార్చుకుంటున్నార‌న్నారు. క‌నుక ప్ర‌జ‌లు డ‌బ్బులు తీసుకుంటున్నార‌ని ప్రొ.నాగేశ్వ‌ర్ త‌న విశ్లేష‌ణ‌లో చెప్పారు.

జేసీ దివాక‌ర్‌రెడ్డి చెప్పిన‌ట్టు ప్ర‌జ‌లు అడిగితేనే ఇస్తున్నారంటే.. ప్ర‌జ‌లు అడిగినంత ఎందుకు ఇవ్వాలి..? నిజంగానే మీరు మంచి పాల‌న అందించి ఉంటే.. మీరు మంచి ప్ర‌తినిధిగా ప‌నిచేసి ఉంటే.. ప్ర‌జ‌లు డ‌బ్బులు అడిగి ఓటు వేయ‌డం కాదు.. ప్ర‌జ‌లే డ‌బ్బులిచ్చి మీకు ఓటెయ్యాల‌ని, ఆ ర‌క‌మైన నిజాయితీని రాజ‌కీయాల్లో ఎందుకు చూప‌లేక‌పోతున్నార‌న్న‌దే ప్ర‌శ్న అంటూ ప్రొ.నాగేశ్వ‌ర్ అన్నారు.