మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి 3 మార్గాలు

0
225
మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా ? : 3 మార్గాలు ఇవే
మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా ? : 3 మార్గాలు ఇవే

ఎట్టకేలకు మొదటి విడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక మిగిలింది పోలింగ్ మాత్రమే. ఏప్రిల్ 11న తొలివిడత పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ద్వారా మీ నాయకుడు ఎవరో మీరే స్వయంగా ఎన్నుకోబోతున్నారు. అలాంటి మీ పేరు ఓటరు జాబితాలో ఉందా ? లేదా ? అసలు మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుసుకున్నారా ? ఇంకా తెలుసుకోకపోతే ఇలా తెలుసుకోండి. అందుకోసం మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు. మీ ఓటు ఉందా ? లేదా ?, మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో ఈ 3 మార్గాల ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.

మీ ఓటు ఎక్కడో తెలుసుకోవడానికి 3 మార్గాలు..

  1. SMS.. జస్ట్ SMS ద్వారా మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుసుకోవచ్చు. అందుకోసం మీ ఫోన్ నుంచి 9223166166 లేదా 1950 నెంబర్‌కు SMS పంపాల్సి ఉంటుంది. ఈ కింద ఉన్న ఫార్మాట్‌ లో SMS పంపాలి. మీరు తెలంగాణ ఓటరు అయితే TS VOTE అని టైప్ చేసి ఆ తర్వాత మీ ఓటర్ ఐడీ నెంబర్ టైప్ చేసి పంపాలి. ఉదాహరణకు TS VOTE ABC1234567 అని టైప్ చేసి 9223166166, లేదా 1950 నెంబర్‌కు SMS పంపాలి. ఇలాగే ECI VOTERID NO అనే ఫార్మాట్‌లో SMS పంపినా మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుస్తుంది. ఉదాహరణకు ECI ABC1234567
  2. NAA VOTE APP.. మీ స్మార్ట్‌ ఫోన్‌లో NAA VOTE యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. క్లిక్ డౌన్‌లోడ్ యాప్. Voters search పైన క్లిక్ చేయండి. మీ పేరు, తండ్రి పేరు టైప్ చేసి వయస్సు, జెండర్, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక ఎంచుకోవాలి. చివరగా క్యాప్చా కోడ్ టైప్ చేసి Search పైన క్లిక్ చేస్తే చాలు మీ పూర్తి వివరాలు వస్తాయి. ఇలా కాకుండా మీ దగ్గర ఉన్న EPIC నెంబర్ సాయంతో కూడా పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చు.
  3. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్… నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. టాప్ లెఫ్ట్‌ లో మీకు ‘Search Your Name in Electoral Roll’ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా సెర్చ్ డీటెయిల్స్ ఆధారంగా మీ పేరు చెక్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడీ కార్డుపైన EPIC నెంబర్ ఉంటుంది. EPIC నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే చాలు మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుస్తుంది.