ఏపీలో ఇప్పుడు ఇదే వైర‌ల్ : ప్రశాంత్ కిషోర్ లెక్క‌లు త‌ప్ప‌నున్నాయా..? వైసీపీ రిజ‌ల్ట్ ఇదే..!

0
1088

ముగిసిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఏ పార్టీ అధికారంలోకి రానుంది..? ఎవ‌రు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఎక్కువ‌శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్‌, వైఎస్ జ‌గ‌న్ అని స‌మాధానం చెబుతున్నారు.

ఇలా చెప్పే వారిలో ఇత‌ర పార్టీల అభిమానులు కూడా ఉన్నార‌ని స‌మాచారం. మ‌రికొంద‌రు మాత్రం ఎన్నిక‌ల ఫ‌లితాలపై అత్యుత్సాహం ప‌నికిరాద‌ని, రిజ‌ల్ట్ తేల‌నున్న మే 23వ తేదీ వ‌ర‌కు ఆగాల్సిందేన‌ని చెబుతున్నారు.

అయితే, ఏప్రిల్ 11న ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన నాటి నుంచి నేటి వ‌ర‌కు కూడా ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌ల స‌ర్వే ఏజెన్సీల రిపోర్టుల వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అలా విడుద‌లైన ప్ర‌తి స‌ర్వే కూడా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కానున్నార‌ని, వైసీపీ అధికారంలోకి రానుంద‌ని చెబుతున్నాయి.

అలా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించి ఏ పార్టీ ఎన్ని స్థానాల‌ను గెలుపొంద‌నుందో చెప్పిన వారిలో ప్ర‌శాంత్ కిశోర్ కూడా ఒక‌రు. ప్ర‌శాంత్ కిశోర్ తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 107 అసెంబ్లీ స్థానాల‌ను గెలుపొంద‌నుంద‌ని తేలింది.

ఇటీవ‌ల విడుద‌లైన స‌ర్వేల‌న్నీ కూడా వైసీపీకి 110 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు వస్తాయ‌ని ప‌క్కాగా లెక్క‌లు వేసి మ‌రీ చెప్పాయి. మ‌రొకొన్ని స‌ర్వే ఏజెన్సీలు అయితే 90 నుంచి 100 వ‌ర‌కు అని స్ప‌ష్టం చేశాయి. ఈ లెక్క‌న తాజాగా విడుద‌లైన ప్ర‌శాంత్ కిశోర్ స‌ర్వేలోను వైసీపీకి 107 స్థానాలు అని చెప్ప‌డాన్ని చూస్తుంటే ఆ పార్టీ వంద సీట్లను గెల‌వ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ప్ర‌శాంత్ కిశోర్ చేసిన ఈ స‌ర్వే ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతాయో తెలియాలంటే వ‌చ్చే 23వ తేదీ వ‌ర‌కు వేచిచూడ‌క త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.