జ‌గ‌న్‌తో, వైసీపీతో ప్ర‌శాంత్ కిశోర్ విసిగిపోయాడా..?

0
192

వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌తో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ శుక్ర‌వారం రాత్రి ఐపాక్ కార్యాల‌యంలో భేటీ అయ్యారు. వైసీపీ కోసం ప‌నిచేసిన ప్ర‌శాంత్ కిశోర్ టీమ్‌కు జ‌గ‌న్ అభినంద‌న‌లు తెలిపారు. అయితే, వైసీపీ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా పీకే టీమ్ ప‌నిచేసింది… ప్ర‌శాంత్ కిశోర్ సూచ‌న‌ల‌ను జ‌గ‌న్ తూచా పాటించిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల‌కు ముందే పీకే టీమ్ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్ర‌చారం చేసింది. పీకే సూచ‌న‌ల‌తోనే వైఎస్ జ‌గ‌న్ అభ్య‌ర్ధులను ఎంపిక చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌శాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ త‌న‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలుసుకున్న చంద్ర‌బాబు న‌కిలీ స‌ర్వేల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించారు. అదే స‌మ‌యంలో వైసీపీతో తాను విసిగిపోయాన‌ని జ‌గ‌న్‌తో త‌న‌కు విభేదాలు వ‌చ్చాయ‌ని టీడీపీ ప్ర‌చారం చేస్తుందని ఆ ప్ర‌చార‌న్ని ఖండిస్తున్నాని తెలిపారు. ఏపీ ప్ర‌జ‌లు ఎవ‌రికి అధికారాన్ని క‌ట్ట‌బెట్లాలో అన్న విష‌యంపై ఇప్ప‌టికే నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ని, బై బై బాబు అంటున్నార‌ని ప్ర‌శాంత్ కిశోర్ అంటున్నారు.