యూత్ ని ఆకర్శించేస్తూ.. వైరలవుతున్న ప్రగతి ఫొటో..!

0
255
pragathi
pragathi latest pic

టాలీవుడ్ లో హీరో హీరోయిన్లతో పాటు సినిమా హిట్ కొట్టడంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మీ అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఆర్టిస్ట్  ప్రగతి. ఈవిడ అంటే తెలియని వారెవరు ఉండరు. ఒక అక్కగా, వదినగా , అమ్మగా చేయాలంటే అందరికి గుర్తువచ్చేంత పాపులారిటీ సంపాదించుకుంది. తల్లి పాత్రలో సుధా తర్వాత ప్రగతి సూట్ అవుతుందని ‘యంగ్ మదర్ ‘ గా ప్రేక్షకులలో, సినీపరిశ్రమలో పేరు తెచ్చుకుంది.

దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుండి తల్లి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ప్రగతి ఫొటో ఒకటి హల్చల్ చేస్తుంది. ప్రేక్షకులకు మరింత చేరువయ్యే పరంగా ప్రగతి అప్పుడప్పుడు పోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటారు. ఇక ఈ ఫొటో చూస్తే ‘అందమైన అమ్మ’ గా ఇన్నాళ్లు ప్రేక్షకులను మెప్పించిన ‘అందమైన అమ్మాయి’ ఈమేనా అనేలా ఉంది. ఎల్లో నిలువు చెక్స్తో కూడిన ప్యాంట్ తో , వైట్ కలర్ టాప్ తో దర్శనమిచ్చింది. నడుము పై ఒక చేయి వేసుకొని , హెయిర్ లీవ్ చేసుకొని మస్తు మోడర్న్ గా అనిపించింది. మేకప్ లోకి వస్తే రెడ్ హెవీ లిప్స్టిక్ పెట్టుకుని, రైట్ హ్యాండ్ కి వాచ్ తో ప్రగతి యూత్ ని ఆకట్టుకునేలా ఉంది.