ప్రభాస్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ..!

0
255
sahoo prabhas

‘బహుబలి2’ తర్వాత చాలా గ్యాప్ తో రూపొందుతున్న ప్రభాస్ తాజా సినిమా ‘సాహో. యూవీ క్రియేషన్స్ మీద సుజీత్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ కలిసి నటిస్తున్న విషయం మనందరికి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు శుభవార్త అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో ను వదిలారు. ఆ వీడియోలో ప్రభాస్ రేపు ఒక సర్ ప్రైజింగ్ న్యూస్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి అంటూ చెప్పాడు.

ఈ మధ్యే హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ప్రభాస్ మీద స్పెషల్ ఫోటో షూట్ జరిగింది. ఈ ఫోటో లను ప్రచారానికి వినియోగించబోతున్నట్లు సమాచారం. ఇదివరకే సినిమా నుంచి విడుదలైన సాహో 1, 2 షేడ్స్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభించింది. భారీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న రేపు ‘సాహో’ నుండి పోస్టర్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా ఫిల్మ్ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.

300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో విడుదల కాబోతున్న సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆగస్టు 15వ తేదీన విడుదల చేయుటకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘బహుబలి 2’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా అంతే రేంజ్ లో ‘సాహో’ ఉంటుందని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

Surprise Tomorrow

Hello darlings… A surprise coming your way, tomorrow. Stay tuned…Instagram.com/ActorPrabhas

Posted by Prabhas on Sunday, May 19, 2019