బీజేపీలోకి రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌..!

0
182

త‌న అభిమానులంతా బీజేపీలో చేరాల‌ని ఆ పార్టీ నేత, రెబ‌ల్‌స్టార్‌ కృష్ణంరాజు విజ‌య‌వాడ‌లో జ‌రిగిన పార్టీ బ‌హిరంగ స‌భ‌లో పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే కృష్ణంరాజు బీజేపీలో ఎప్ప‌ట్నుంచో ఉన్న‌ప్ప‌టికీ త‌న ఫ్యాన్స్‌ను పార్టీలో చేర‌మంటూ ఎప్పుడూ ఇలా పిలుపు ఇవ్వ‌లేదు. ఏపీలో పార్టీప‌రంగా బ‌లంపుంజుకునేందుకు అధిష్టానం ఫోక‌స్‌పెట్టిన నేప‌థ్యంలో రెబ‌ల్‌స్టార్ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలుస్తుంది.

పెద‌నాన్న కృష్ణంరాజు ఇచ్చిన పిలుపుకు స్పందించి బాహుబ‌లి ప్ర‌భాస్ బీజేపీ స‌భ్య‌త్వం తీసుకుంటారా..? అన్న చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో మొదలైంది. అస‌లు ప్ర‌భాస్ రాజ‌కీయాల‌కు పూర్తిగా దూరంగా ఉంటారు. అదే స‌మ‌యంలో పెద‌నాన్న గీసిన గీత‌ను దాట‌రు. మ‌రి ఇప్పుడు కృష్ణంరాజు ఇచ్చిన పిలుపు విష‌యంలో ప్ర‌భాస్ ఏం చేస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అయితే బాహుబ‌లి చిత్రంతో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ స్టార్‌డ‌మ్ ఒక‌రేంజ్‌కు చేరింది. అంతేకాక అన్ని రాజ‌కీయ పార్టీల‌కు చెందిన వారిలో కొంద‌రు ప్ర‌భాస్ అభిమానులుగా ఉన్నారు. రాజ‌కీయాల‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ప్ర‌భాస్ ఎలా ఉంటారో అలానే అభిమానులు కూడా ర‌క‌ర‌కాల పార్టీల్లో ఉన్నా సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాత్రం ప్ర‌భాస్‌కే జై కొడుతుంటారు.

ఈ నేప‌థ్యంలో పెద‌నాన్న కృష్ణంరాజు మాటవిని బీజేపీ స‌భ్య‌త్వం తీసుకుంటే వివిధ రాజ‌కీయ పార్టీల్లో ఉన్న ఫ్యాన్స్ దూర‌మ‌వుతార‌న్న ఆందోళ‌న ప్ర‌భాస్‌ను వెంటాడుతోంద‌ట‌. కానీ, పెద‌నాన్న కృష్ణంరాజు మాట‌ల‌ను లైట్ తీసుకుందామా..? అంటే ఫ్యాన్స్ అంతా పార్టీలో చేరాల‌ని పిలుపునిస్తే చివ‌ర‌కు ప్ర‌భాస్ కూడా ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌న్న చ‌ర్చ ఫిల్మ్‌సిటీ వ‌ర్గాల్లో విస్తృతంగా న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఫ్యాన్స్‌కు, పెద‌నాన్న‌కు మ‌ధ్య న‌లిగిపోతున్న ప్ర‌భాస్ ఏం చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.