కాలేజీ స్టూడెంట్‌గా డార్లింగ్..!

0
161

బాహుబలి తరువాత ప్రభాస్ దేనికీ సందేహించడం లేదు. బాహుబ‌లి ఇచ్చిన కిక్‌తో కొత్త కొత్త ఛాలెంజెస్‌ను డార్టింగ్ ఇట్టే టేకప్ చేసేస్తున్నాడు. అది ఈజీ క్యారెక్ట‌రా..? ట‌ఫ్ క్యారెక్ట‌రా.?? అనే సందేహం లేకుండా, న‌ట‌న‌కే ప్రాధాన్య‌త‌నిస్తూ త‌న‌ను తానే మార్చేసుకుంటున్నాడు. తాను ఏం చేసినా త‌న అభిమానుల‌ను మెప్పించేందుకే అన్న కాన్సెప్ట్‌ను చెప్ప‌క‌నే చెబుతూ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌తో ఆడియన్స్‌ను త్రిల్ చేస్తున్నాడు.

అయితే, బాహుబలి లో మ్యాచు మ్యాన్ గా యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్నా ప్రభాస్ నెక్స్ట్ కాలేజీ స్టూడెంట్ గా అల్లరి చేయబోతున్నాడట. జిల్ చిత్రం ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజాహెగ్దే హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కిస్తున్న లవ్ స్టోరీలో ఈ యంగ్ రెబల్ స్టార్ కాలేజీ స్టూడెంట్‌గా సందడి చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

కాగా, ప్రభాస్ మొన్న‌టి వ‌ర‌కు మాస్ యాక్షన్ స్టోరీస్‌లు చేస్తూ కాలేజీ లవ్ స్టోరీ సినిమాలు పక్కన పెట్టేసిన సంగ‌తి తెలిసిందే. ఓన్లీ ఫైటింగ్‌లు, గ‌న్‌ల‌తో బిజీ.. బిజీగా గ‌డిపాడు. పైగా ప్రభాస్ 40కి దగ్గర పడ్డాడు. అలాంటిది వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా కాలేజీకి వెళ్లాలంటే ప్రభాస్ లో చాలా మార్పులు రావాలి. బరువు నుంచి లుక్ వరకు అన్నింటిని మార్చుకోవాలి. ఈ మార్పులు తెచ్చుకోవటం ప్రభాస్ కి పెద్ద‌ప‌నేం కాద‌ని ఆయ‌న అభిమానులు ఎంక‌రేజ్‌మెంట్ కామెంట్లు చేస్తున్నారు.