కృష్ణంరాజు పుట్టిన రోజు కానుకగా.. డార్లింగ్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్..!

0
394
prabhas
Rebal star krishnamraj with prabhas

టాలీవుడ్ లోకి కృష్ణంరాజు వారసత్వం చేతబట్టుగొని మాస్ చిత్రం ‘ఈశ్వర్’ తో ఎంట్రీ ఇచ్చాడు రెబల్ స్టార్. ఆ తరువాత కొన్ని సినిమాలలో అపజయాన్ని రుచి చూసిన, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ ను ఒక మలుపు మలిచింది. ఆ తర్వాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలలో రొమాంటిక్ హీరోగా కనిపించాడు. కొరటాల దర్శకత్వంలో ఫ్యాక్షన్ సినిమా గా అలరించిన ‘మిర్చి’ లో ప్రభాస్ నటన కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాజమౌళి డైరెక్షన్ లో మరొక సారి ఛాన్స్ కొట్టాడు రెబల్ స్టార్. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలలో నటించి భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

నిజానికి బాహుబలి చిత్రాల సమయం లోనే ప్రభాస్ పెళ్లి చేసుకోవాల్సింది. కానీ సినిమా మీద ఉన్న డెడికేషన్ వలన ఐదు సంవత్సరాల పాటు వివాహానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ప్రభాస్ పెళ్లి పై ఇప్పటికే ఎన్నో రూమర్స్ బయటకు వచ్చాయి. ఆ మధ్య భీమవరానికి చెందిన ఓ అమ్మాయితో వివాహం జరగనున్నట్లు ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. సినీ ఇండస్ట్రీ లో కూడా బాహుబలి పెళ్లి ఎవరితోనా అని ఎదురుచూస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా తాజాగా కృష్ణం రాజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై స్పందించి విషయాన్ని తెలిపారు.

ఈ రోజు కృష్ణం రాజు జన్మదినము సందర్భమును పురస్కరించుకొని ప్రభాస్ పెళ్లి గూర్చి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం ముగిసిన వెంటనే ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి కొడుకవుతాడంటూ తెలిపారు. ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్ మీదనే దృష్టి సారించాడు. ఇప్పుడు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెబల్ . ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్నసాహో చిత్రం ప్రేక్షకులను తప్పకుండ అలరిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రం పూర్తికాగానే ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుందంటూ తెలిపారు.