ప్రభాస్ కి షాకిచ్చిన సాహో ఓవర్సీస్ రైట్స్..!

0
250
saaho movie getting high rate in overseas rights
saaho movie getting high rate in overseas rights

యూవీ క్రియేషన్స్ పై సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా `సాహో` లో ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా భారీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించుటకు దర్శకులు చాలా మొత్తంలో పైసా ఖర్చు చేస్తున్నారు. హై టెక్నాలజీ వాడుతూ హాలీవుడ్ ని తలపించేలా తెరకెక్కించాలని బాహుబలి తరువాత ప్రభాస్ కి అంతే రేంజ్ లో హిట్ సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాహో 1, 2 షేడ్స్ కు ప్రేక్షకులనుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా ఖర్చు విషయానికొస్తే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతుండగా వీటికి దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఈ ఖర్చు చూస్తుంటేనే అర్ధమవుతుంది ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించుటకు సిద్ధమయ్యారో దర్శక నిర్మాతలు. కేవలం ఒక ఫైట్ సన్నివేశం దుబాయ్ లో గల అబుదాబిలో షూట్ చేశారు. మరి ఫైట్ సీన్ కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా 100 కోట్ల రూపాయలట. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ముప్పై ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేశారట.

భారీ బడ్జెట్ తో , అభిమానుల్ని భారీగా మెప్పించేలా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ఖర్చుకు తగ్గట్టుగానే ఓవర్సీస్ రైట్స్ కూడా అలాగే పలికాయని చెప్పవచ్చు. ప్రభాస్ మూవీకి ఓవర్సీస్ రైట్స్ 45 కోట్ల రూపాయలు పలికిందట. ఒక్క ఓవర్సీస్ లో ఇంతగా అమ్ముడు పోయిందంటే, మిగితా ప్రదేశాలలో ఎంతగా పలుకుతుందో చూడాలి. ఈ సినిమాను ఆగస్టు నెలలో విడుదల చేయుటకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపారు.

దర్శకులు : సుజీత్
నిర్మాత: వ్ వంశీ కృష్ణ రెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి, కారం జోహార్ , భుషణ్కుమార్
నటి నటులు: ప్రభాస్ , శ్రద్ధాకపూర్ ,వెన్నెల కిశోర్
సంగీతం: శంకర్ ఇషాన్ లాయ్
భాషలు: హిందీ, తెలుగు, తమిళ్
బడ్జెట్: 300 కోట్లు
విడుదల: ఆగష్టు 15