ఒక్క పోస్ట్ లేదు కానీ… ప్రభాస్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు..!

0
295
prabash instagram latets news

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందని రిలీజ్ కాబడిన ట్రైలర్ సంచలనము సృష్టిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది లోను భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయికి చేరిందో.. తెలియాలంటే ప్రభాస్ ఫేస్‌బుక్‌ చూడాల్సిందే.

ఈ మధ్య సెలెబ్రెటీలంతా వారి వారి అభిప్రాయాన్ని తెలియ చేయుటకు సోషల్‌ మీడియా తెగ వాడేస్తున్నారు. ఆ నేపథ్యం లోనే తాజాగా ప్రభాస్ అఫీషియల్‌ గా ఇన్స్‌స్టాగ్రామ్‌ అకౌంట్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఉన్న అఫీషియల్‌ ఫేస్‌బుక్‌ లో కోటి మంది కంటే ఎక్కువగా ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే ఈ అకౌంట్‌కి స్పెషల్ ఉంది. ఒక్క పోస్ట్ చేయకుండానే సుమారుగా ఏడూ లక్షల మంది ఫ్యాన్స్ ఫాలో ఉన్నారు. ప్రభాస్ కున్న క్రేజ్ ఏంటో దీన్ని బట్టే తెలుస్తుంది. అయితే ఈ ఇన్స్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో సాహో సినిమా కు సంబందించిన మొదటి పోస్ట్ చేయనున్నారని రెబల్‌ స్టార్‌ సమాచారం. ఈ సినిమా ఆగస్ట్ 15వ తేదీన విడుదల చేయనున్నారు.