మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరిన‌ పోసాని?

0
191

పోసాని కృష్ణ‌ముర‌ళీ.. సినీ, రాజ‌కీయ‌రంగ ప‌రంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. రెండు నెల‌ల క్రితం జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలోను వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పోసాని ప్ర‌ధాన పాత్ర పోషించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుప‌డ‌టంలో సీఎం జ‌గ‌న్ త‌రువాత పోసానినే అనేంతలా నిత్యం వార్త‌ల్లో నిలిచారు.

అయితే, పోసాని కృష్ణ ముర‌ళీ గ‌త కొంత‌కాలంగా ఆసుప్ర‌తిలో చికిత్స పొంది, ఈ మ‌ధ్యే డిస్చ‌ర్జ‌యిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న ఆరోగ్యం బాగు ప‌డింద‌ని, ఇక టిడిపికి చుక్క‌లే అని వైసిపి వ‌ర్గాలు భావించాయి.

అయితే పోసానిపై ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోసాని ఇట‌వ‌ల చేయించు కున్న‌ ఆపరేషన్ వికటించడంతో.. ఆరోగ్యం క్షీనించిన‌ట్టు ఆ వార్త సారాంశం. దీంతో ఆత‌ని అభిమానులే కాదు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని వారు కూడా ఆందోళనకు గురవుతున్నారు,