లక్ష్మీ పార్వతిపై లైంగిక ఆరోపణలు సిగ్గుచేటు : ఫైర్ అయిన పోసాని

0
293
లక్ష్మీ పార్వతిపై లైంగిక ఆరోపణలు సిగ్గుచేటు : ఫైర్ అయిన పోసాని
లక్ష్మీ పార్వతిపై లైంగిక ఆరోపణలు సిగ్గుచేటు : ఫైర్ అయిన పోసాని

పోసాని కృష్ణ మురళి ఏం మాట్లాడినా అందులో నిజం, నిజాయితీ, కచ్చితత్వం ఉంటుందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ప్రస్తుతం ఆయన YSRCPలో ఉన్నారు. ఎలాగైనా జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని చాలానే తపన పడుతున్నాడు. అలాగని తప్పుడు ప్రచారాలు చేయడం ఆయన స్టైల్ కాదు. పేరు జగన్ తప్పు చేసిన మీడియా ముందుకు వచ్చి తిడతాడు. అందుకు పెద్ద ఉదాహరణ చంద్రబాబు గారే.. ఒకప్పుడు ఆయనే బెస్ట్ CM అన్న పోసాని బాబు అవినీతి చూసి మోసగాడు అని మొహం మీదే తిట్టేశాడు.

అలాంటి పోసాని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రనికి జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుతుంది అని నమ్ముతున్నాడు. అందుకోసం చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు ఏంటి ? అనేది బయటపెడితే బాబుపై ప్రజల్లో నెగిటివిటీ పెరిగి, ఆ “ఓటు బ్యాంగ్” జగన్ పైపు మల్లుతుంది అని భావించాడు. అందులో బాగంగానే కెమెరాలు ఇంకా ఆన్ కాలేదు అని భావించిన చంద్రబాబు, ఒక ప్రముఖ టీవీ ఛానల్ అదినేతతో మాట్లాడుతున్నాడు.

ఆ వీడియోలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరితారకరామరావు గారిని ఉద్దేశించి.. “ఇక వాడి పని అయిపోయింది.. ఇకపై అన్నీ నేనే” అనేలా చంద్రబాబు గారు మాట్లాడాడు. అదే కాకుండా “ఆరోగ్య శ్రీ” డబ్బులు మళ్లించి, పార్టీ పబ్లికిటికి వాడుకుందాం అని.. పథకాలన్నింటికి పేర్లు మార్చి తన పేరు పెడదాం అని ఎన్నో మాట్లాడాడు చంద్రబాబు. ఈ వీడియో పోసానికి ఎవరిచ్చారో తెలియదు కానీ.. ఆ మీడియా సాక్షిగా చంద్రబాబు అసలు రూపం బయటపెట్టదు పోసాని. మరీ ఈ వీడియో నిజంగా నిజమేనా ? లేదా మార్ఫింగ్ చేసిన వీడియోనా ? అనేది ఇంకా తేలాల్సి ఉంది.

ఇదిలాఉంటే ఇదే వేదిక మీద లక్ష్మీ పార్వతిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై కూడా స్పందించాడు పోసాని. ఒంటరిగా ఉంటున్న 70 ఏళ్ల బామ్మపై ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం సిగ్గిచేటు. ఎవడో అనాముకుడు కంప్లెంట్ ఇస్తే.. అది నిజమో కాదో తెలిసికోకుండా చంద్రబాబు గారికి సంబందించిన రెండు ఛానల్స్ పదే పదే టెలికాస్ట్ చేసి ఆమె పరువు తీసేశాయి. ఇంత జరుగుతున్నా TDP నేతలు ఏం చేస్తున్నారు. ఆమె సాదారణ వ్యక్తి కాదు TDP పార్టీ అధినేత స్వర్గీయ ఎన్‌టి‌ఆర్ గారి భార్య.. అలాంటి ఆమెపై కేసు పెట్టిన వాడిపై మీరు కేసు పెట్టాలి కానీ.. TDP పార్టీ దగ్గరుండి మరీ ఆమె పరువు తీయడం సిగ్గిచేటు అని సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని.