ఆ క‌ప్పుకాదు..నా డీ క‌ప్పులు తీసుకోండి.. పాక్‌కు పూనం షాక్ ట్రీట్మెంట్‌

0
378

భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ ఆ మ‌ధ్య భార‌త్ హీరోగా నిలిచారు. పాక్ యుద్ధ‌విమానాల్ని కూల్చి త‌ర్వాత పాక్‌కు బందీగా చిక్కి విడుద‌లైన అభినంద‌న్ మీద పాక్ మీడియా ఒక అవమానక‌ర యాడ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ యాడ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే ఈ యాడ్‌పై షాకింగ్ కౌంట‌రిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. “నిన్ననే నా వాట్సాప్‌లో పాకిస్తాన్‌కు సంబంధించిన ఈ యాడ్‌ను చూశాను. ఓ హీరో చేసిన పనిని వారు అపహాస్యం చేశారు. పాకిస్తాన్‌ ఇది మంచిది కాదు. ఈ యాడ్‌పై నా సమాధానం ఏంటంటే? టీ కప్పులపై సెటైర్లు ఎందుకు. వాస్తవానికి మీకు కావాల్సింది. ఈ కప్‌.. తన లోదుస్తులు చూపిస్తూ..  డబుల్‌ కప్‌’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.