బోల్డ్ క్యారెక్టర్స్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన పూజా

0
120

ఇప్ప‌టి వ‌ర‌కు తాను ఎన్ని చిత్రాల్లో న‌టించినా గుర్తింపు రాలేద‌ని బాధ ప‌డిందో..? లేక అవ‌కాశాలు వాటికై అవి రావు.. మ‌న‌మే అందిపుచ్చుకోవాల‌ని పెద్ద‌లు చెప్పిన జీవిత స‌త్యం గుర్తుకు తెచ్చుకుందో ఏమో కానీ వెండితెర‌పై అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు రెడీ అంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది ఓ కుర్ర భామ‌. త‌న నిర్ణ‌యం సినీ ప‌రిశ్ర‌మ‌కు తెలిసేలా ప్ర‌క‌ట‌న‌లు కూడా ఇచ్చేసింది. ఇంత‌కీ ఆ భామ పేరు చెప్ప‌లేదు క‌దూ.. ! ఆమెనే పూజా రామ చంద్ర‌న్‌.

మ‌ర‌ల తెలుప‌నా ప్రియా, దోచెయ్‌, ల‌వ్ ఫెయిల్యూర్‌, కృష్ణార్జున‌యుద్ధం, దేవి శ్రీ ప్రసాద్ వంటి తెలుగు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఈ భామ‌ను విజ‌యం ప‌ల‌క‌రించ‌లేదు. బుల్లితెర‌పై నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్ చేసిన బిగ్‌బాస్ -2 షోలో వైల్డ్ కార్డ్‌పై అవ‌కావం క‌ల్పించినా పూజా రామ‌చంద్ర‌న్ మాత్రం ఫ‌ర్ఫామెన్స్‌తో ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది.

మ‌రో ప‌క్క ప్ర‌ముఖ న‌టుడు జాన్ కొక్కెన్‌తో ఈ భామ స‌హ‌జీవ‌నం చేస్తుందన్న పుకార్లు టాలీవుడ్‌లో షికార్లు చేస్తున్నాయి. పూజా రామ‌చంద్ర‌న్ వీజేగా ప‌నిచేసే స‌మ‌యంలో తోటి విజేతో ప్రేమాయ‌ణం న‌డిపి పెళ్లి కూడా చేసుకుంద‌ని, వారిద్ద‌రి మ‌ధ్య త‌లెత్తిన వివాదాల‌తో విడాకులు తీసుకున్నార‌ని, ఆ త‌రువాత జాన్ కొక్కెన్‌తో స‌హజీవ‌నం చేస్తుందన్న‌ది చిత్రపురి కాల‌నీ వాసుల మాట‌. వారి మాట‌ల‌ను పూజా కొట్టిపారేసింది. త‌న‌కు, జాన్‌కు మ‌ధ్య అటువంటి సంబంధమేమీ లేద‌ని, ఇద్ద‌రం ఒకే ఇండ‌స్ట్రీకి చెందిన‌వార‌ము కాబ‌ట్టి త‌మ‌పై ఇటువంటి రూమ‌ర్లు రావ‌డం స‌హ‌జ‌మేన‌ని, వాటిని తాము ప‌ట్టించుకోమంటూ పూజా రామ‌చంద్ర‌న్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

ఇక సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గ‌డంపై పూజా రామ‌చంద్ర‌న్ వివ‌ర‌ణ ఇస్తూ.. తాను ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన చిత్రాల్లో న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌లు చేయ‌లేద‌ని, ఇక‌పై చిత్రాల ఎంపిక‌లో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తాన‌ని తెలిపింది. ఇటీవ‌ల కాలంలో విడుద‌ల‌వుతున్న చిత్రాల్లో బోల్డ్‌నెస్ కామ‌న్ అయిన నేపథ్యంలో క‌థ డిమాండ్ చేస్తే గ్లామ‌ర్ షోకు తాను సిద్ధ‌మంటూ ప్రొడ్యూస‌ర్ల‌కు, డైరెక్ట‌ర్ల‌కు ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది.