ఆమె ఎవరు ? : పూర్తి వివరాలు ఇదిగో

0
313
ఆమె ఎవరు ? : పూర్తి వివరాలు ఇదిగో
ఆమె ఎవరు ? : పూర్తి వివరాలు ఇదిగో

మే 5న ఎవ్వరూ ఊహించని ఓ సంఘటన జరిగింది. పసుపు రంగ చీర, కళ్లద్దాలు, చేతిలో ఈవీఎంలు పట్టుకొని ఒక మహిళా పోలింగ్ కేంద్రానికి అలా నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడే ఉన్న ఒక జనరలిస్టుకు ఆమె సినిమాలో హీరోయిన్ లా కనిపించిందో ఏమో వెంటనే ఆమెను తన కెమెరాలో బందించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతే ఆ ఫోటో నెటిజన్స్ ని బాగా ఆకర్షించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటోపై అనేక ట్రోల్స్ కూడా జరిగాయి. ఈమె ఎవరో కానీ సినిమా హీరోయిన్ కంటే అందంగా ఉంది.. నాకు తెలిసి ఆమె డ్యూటీ చేసిన పోలింగ్ కేంద్రంలో 100 శాతం పోలింగ్ అయ్యుంటుంది అంటూ అనేక ట్రోల్స్ జరిగాయి. దాంతో ఒక్కసారిగా ఆమె సెలబ్రేటిగా మారిపోయింది. అక్కడి వరకు బాగానే ఉన్నా ఆమె ఎవరు ? ఏంటి ? అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఆమె వివరాలకోసం చాలానే వెతికారు కొందరు నెటిజన్స్. ఫలితంగా అమెపేరు “రీనా ద్వివేది” అని తెలిసింది.

ఉత్తరప్రదేశ్‌ కు చెందిన ఈమె ప్రభుత్వ ఉద్యోగి. లఖ్‌నవూలోని పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. 5వ దశ ఎన్నికల్లో భాగంగా మే 6న లఖ్‌నవూలోని, “నగ్రామ్‌”లో గల ఓ పోలింగ్‌ కేంద్రంలో ఆమె విధులు నిర్వహించారు. ఇందుకోసమే 5 రోజున ఈవీఎంలు తీసుకుని పోలింగ్‌ కేంద్రానికి వెళ్తూ అనుకోకుండా కెమెరాకు చిక్కారు. ఇప్పుడు సెలబ్రేటి అయ్యారు.. ఇది ఈ ఫోటో వెనకున్న అసలు కథ.