బెజ‌వాడ‌లో బ‌రితెగించిన పోలీసులు..!

0
269

బెజ‌వాడ పోలీసులు బ‌రి తెగించారు. ఏకంగా భ‌వానిపురం పోలీసు స్టేష‌న్‌లోనే పేకాట‌ను మొద‌లుపెట్టేశారు. స్టేష‌న్‌లోని బ్యార‌క్‌లో నిత్యం పేకాట‌, మ‌ద్యం తాగుతూ కాల‌క్షేపం చేస్తున్నారు. స్టేష‌న్‌కు సంబంధించిన ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి కానిస్టేబుళ్లు పేకాట‌, మ‌ద్యం తాగుతూ హ‌ల్‌చ‌ల్ చేశారు. పైగా, పోలీసు స్టేష‌న్‌లోనే ఒక‌రికొక‌రు తిట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు కూడా. విధుల‌ను ప‌క్క‌న‌పెట్టి రోజూ, మ‌ద్యం, పేకాట‌తోనే కాలాన్ని గ‌డిపేస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ స్టేష‌న్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ రెండు రోజుల క్రితం ఓ యువ‌తిని వేధించిన కేసులో సస్పెండ్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రో కానిస్టేబుల్ కూడా తిరుమ‌ల‌లో మ‌ద్యం తాగి దొరికిపోయాడు. అత‌నిని కూడా పోలీసు ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ చేశారు. అయితే, పోలీసుల భాగోతంపై ఉన్న‌తాధికారులు దృష్టి సారించ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.