80 శాతం విజ‌యావ‌కాశాలు వైసీపీకే : ప‌్రొ.నాగేశ్వ‌ర్‌

0
164

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎగ్జిట్‌పోల్స్ వ‌చ్చినా ఏ పార్టీ అధికారం చేప‌ట్ట‌నుంది..? ఎవ‌రు ముఖ్య‌మంత్రి కానున్నారు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి ఎటువంటి క్లారిటీ రాలేదు. కొన్ని ఎగ్జిట్‌పోల్స్ వైసీపీకి ప‌ట్టం క‌ట్ట‌గా, మ‌రికొన్ని టీడీపీకి ప‌ట్టం క‌ట్టాయి. రెండు ప్ర‌ధాన పార్టీలకు స‌రిస‌మానంగా విజ‌యావ‌కాశాలు ఉన్నాయంటూ మ‌రికొన్ని స‌ర్వేలు ఫ‌లితాల‌ను వెల్ల‌డించాయి. దీంతో మే 23న వెలువ‌డ‌నున్న ఫ‌లితాల‌పై మ‌రింత ఆస‌క్తి నెల‌కొంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇదిలా ఉండ‌గా, ఆదివారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు విడుద‌లైన ఏపీ ఎగ్జిట్‌పోల్స్‌కు సంబంధించి ఓ ప్ర‌ముఖ ఛానెల్ నిర్వ‌హించిన డిబేట్‌లో ప్ర‌ముఖ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ పాల్గొన్నారు. ప‌లు సంస్థ‌ల ఫ‌లితాల‌పై విశ్లేష‌ణ‌లు చేయ‌డంతోపాటు, త‌న విశ్లేష‌ణ‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయోన‌న్న అంచ‌నాను వ్య‌క్త‌ప‌రిచారు. త‌న విశ్లేష‌ణ‌కు సంబంధించి తాను ఎటువంటి స‌ర్వేలు చేయించ‌లేద‌న్న విషయాన్ని కూడా నాగేశ్వ‌ర్ స్ప‌ష్టం చేశారు.

కాగా, ప్రొ.నాగేశ్వ‌ర్ విశ్లేష‌ణ మేర‌కు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 50 సీట్లను ప‌క్కాగా గెలుపొందుతుంద‌ని అనేక సంస్థ‌ల ఎగ్జిట్‌పోల్స్ చెప్పిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. అదే స‌మ‌యంలో వైసీపీకి 65 స్థానాలు క‌న్ఫామ్ అన్న ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్‌పోల్స్‌ను నాగేశ్వ‌ర్ తెలిపారు. ఈ రెండు లెక్క‌ల ప్ర‌కారం టీడీపీ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే మ‌రో 45 స్థానాల్లో గెలుపొందాల్సిన అవ‌సరం ఉంది. అలా టీడీపీ మిగిలిన 60 స్థానాల్లో గెలుపొందితే అద్భుత‌మేన‌న్న అభిప్రాయాన్ని నాగేశ్వ‌ర్ వ్యక్త ప‌రిచారు.

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ విష‌యానికొస్తే, ల‌గ‌డ‌పాటి లెక్క‌ల ప్ర‌కారం వైసీపీకి 65 స్థానాలు క‌న్ఫామ‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ఆ లెక్క‌న వైసీపీ మిగిలిన స్థానాల్లో కూడా విజ‌య‌బావుటా ఎగ‌రేయ‌డం ఖాయ‌మ‌ని ప్రొ.నాగేశ్వర్ అన్నారు. మొత్తానికి 80 శాతం మేర గెలుపు అవ‌కాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయ‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న అంచ‌నా వేశారు.