ఇమ్రాన్‌ ఖాన్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

0
127
ఇమ్రాన్‌ ఖాన్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ఇమ్రాన్‌ ఖాన్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

పుల్వమా ఉగ్రదాడి భారత సైనికులను ఎంత మందిని పొట్టన పెట్టుకుందో తెలిసిందే.. ఈ దాడితో దేశప్రజల రక్తం మరిగిపోయింది. దాంతో శాంతి శాంతి అని కూర్చుంటే లాభం లేదు.. పాకిస్తాన్ ని భూస్థాపితం చేయడమే ఈ సమస్యకు అసలు పరిష్కారం అంటూ ముక్తకంఠంతో తమ స్వరం వినిపించారు. దానికి ప్రదాని మోధి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతే దెబ్బకు పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది ఇండియన్ ఆర్మీ. వారి ఊహకుసైతం అందని రీతిలో పాక్ లోకి ప్రవేశించి, అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడి చేసి విజయవంతంగా వెనక్కి వచ్చింది.

ఈ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చెరిపేస్తూ భారత ప్రధాని “నరేంద్ర మోదీ” పాకిస్థాన్‌ తో స్నేహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు ఆ దేశ జాతీయ దినోత్సవాన్ని పురష్కరించుకుని మోదీ పాకిస్థాన్‌ ప్రధాని “ఇమ్రాన్‌ ఖాన్‌”తో పాటు పాక్ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. “శాంతిసామరస్యాలు, ఉగ్రరహిత ప్రపంచం కోసం ఇరుదేశాల ప్రజలు ఐక్యంగా పనిచేయాల్సిన సమయం ఇది” అంటూ మోదీ పేర్కొన్నారు. మోదీ శుభాకాంక్షలు తెలియజేసిన విషయాన్ని స్వయంగా పాకిస్థాన్‌ ప్రధాని “ఇమ్రాన్‌ ఖాన్‌” ట్విట్టర్‌ వేదికగా వెల్లడించాడు.. పైగా స్నేహానికి మేము సైతం రెడీ అనేలా పాకిస్థాన్‌ ప్రధాని “ఇమ్రాన్‌ ఖాన్‌” స్టేట్ మెంట్ ఇవ్వడం వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది.