ఇదీ.. మోదీ స‌ర్వే..

0
106

మళ్లీ మేమే డౌట్ లేదంటున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు లేనే లేవన్న మోదీ.. బీజేపీ, ఎన్డీయేకు ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలం కంటే ఎక్కువ సీట్లే వస్తాయన్నారు. పూర్తి మెజారిటీతో సుస్థిర ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలో సుడిగాలి ప్రచారం సాగిస్తున్న మోదీ త‌న స‌ర్వే సారాంశాన్ని బ‌య‌ట‌పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న 44 మంది సభ్యుల కంటే కూడా తక్కువగానే ఈసారి సీట్లు వస్తాయన్నారు.

2014లో సాధించిన 44 సీట్ల కంటే తక్కువ సీట్లకే కాంగ్రెస్‌ను పరిమితం చేయాలని ప్రజలు పట్టుదలగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు. ఆట బాగా ఆడలేక, ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు సహజంగానే ఎంపైర్‌ను నిందించడం మొదలుపెడతారని, ఇప్పుడు విపక్షాలు చేస్తున్నది కూడా అదేనని మోదీ ఎద్దేవా చేశారు.