కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ‌కు పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆఫ‌ర్‌..!

0
282
mudragada to join tdp
Kapu Leader Mudragada Padmanabham

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార పార్టీ తెలుగుదేశం కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకు అసెంబ్లీ టికెట్ ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను బ‌రిలోకి దింపేందుకు సీఎం చంద్ర‌బాబు ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు కిర్లంపూడిలోని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటికి చేరుకుని ఆయ‌న‌తో పార్టీలో చేరిక విష‌య‌మై చ‌ర్చించిన‌ట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

అయితే, జేఏసీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే ఆ సంఘంలో ఉన్న నాయ‌కుల ప‌రిస్థితి ఏంట‌ని.? వారికి ఎలా న్యాయం చేస్తారన్న ప్ర‌శ్న‌ల‌ను ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం త‌న‌ను క‌లిసిన టీడీపీ ముఖ్య నేత‌ల‌ను ముద్ర అడిగిన‌ట్లు స‌మాచారం. ముద్ర‌గ‌డ సంధించిన ప్రశ్న‌లను సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద ప్ర‌స్తావించి, త్వ‌ర‌లో మీకు స‌మాచారం అందిస్తామ‌ని ముద్ర‌గ‌డ‌తో టీడీపీ ముఖ్యులు చెప్పిన‌ట్లు తెలుస్తుంది.

కాగా, ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపు ఉద్య‌మ నేత‌గా అంద‌రికి తెలిసిన వ్య‌క్తి. కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం త‌న ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తున్నారు. ఆ మేర‌కు అనేక సంద‌ర్భాల్లో ఆందోళ‌న‌ల‌ను కూడా చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు టీడీపీ నుంచి టికెట్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తుంది.