పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఆ రెండు స్థానాలు ఇవే

0
209
పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఆ రెండు స్థానాలు ఇవే
పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఆ రెండు స్థానాలు ఇవే

జనసేన అధినేత “పవన్‌ కళ్యాణ్” పోటీ చేసే స్థానాలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఆయన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి ఈసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. వాటిలో ఒకటి విశాఖపట్నం జిల్లా “గాజువాక” కాగా, రెండోది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.. ఈ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పవన్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

ఇక పవన్ కళ్యాణ్ నామినేషన్‌ ఎప్పుడు దాఖలు చేస్తాడు అనేది ఇవాళ సాయంత్రం లేదా బుధవారం వెల్లడిస్తామని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 స్థానాలు (తిరుపతి, అనంతపురం, రాజానగరం, పిఠాపురం, ఇచ్ఛాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి) పరిశీలించిన అనంతరం అంతర్గత సర్వే నిర్వహించి ఈ రెండు స్థానాలు ఎంపిక చేసినట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

నిజానికి పవన్‌ కళ్యాణ్ “గాజువాక” నుంచి పోటీ చేస్తారని ముందు నుంచి ప్రచారం జరిగింది. కానీ భీమవరం పేరు మాత్రం అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ముందునుండి పవన్‌ ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి పోటీ చేస్తారని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలకు అనుగుణంగానే నిర్ణయం వెలువడింది.