తెలంగాణా కోసం KCR కంటే ముందే కన్నీళ్లు పెట్టా : హైదరాబాద్ సభలో పవన్

0
147
తెలంగాణా కోసం KCR కంటే ముందే కన్నీళ్లు పెట్టా : హైదరాబాద్ సభలో పవన్
తెలంగాణా కోసం KCR కంటే ముందే కన్నీళ్లు పెట్టా : హైదరాబాద్ సభలో పవన్

హైదరాబాద్ LB నగర్ భారీ భయిరంగా సభలో జనసేన అధినేత “పవన్ కళ్యాణ్” తెలంగాణ చరిత్ర, ఇక్కడి ప్రజలు పడ్డ కష్టాలను గురించి మరోసారి గుర్తుచేశాడు. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేది.. నిజాములకు భానిసలుగా ఇక్కడి ప్రజలు అనుభవించిన కష్టాలు తెలిసి కన్నీళ్లు పెట్టుకున్నా అంటూ తెలంగాణ గురించి తనకు ఏం తెలుసో ప్రజలకు చెప్పాడు. చాలామంది నాకు తెలంగాణ గురించి ఏం తెలుసు అంటారు. కానీ తెలంగాణలో పుట్టి ఇక్కడే పెరిగిన వారికి ఎంత తెలుసో నాకు అంత తెలుసు.. మీకు తెలుసా ? తెలంగాణా కోసం KCR కంటే ముందే నేను కన్నీళ్లు పెట్టా.

అప్పటికీ కే‌సి‌ఆర్ ఇంకా తెలంగాణ ఉద్యమం ప్రారంభించలేదు. అప్పటినుండే నాకు తెలంగాణలోని పుట్టా, గుట్టా అన్నీ తెలుసు. ఇక్కడి ప్రజాలతో మమేకమై అందరితో కలిసిపోయా.. నా జీవితం సగం ఇక్కడే గడిచిపోయింది. అలాంటి నాకు తెలంగాణ గురించి తెలియదు అంటున్నారంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తా అంటూ తెలంగాణ గురించి, ఇక్కడి ప్రజల గొప్పతనం గురించి క్లుప్తంగా వివరించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Read Also: టీడీపీ మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌నున్న చంద్ర‌బాబు..!