ఏపీలో వ‌చ్చేది జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మే : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

0
294

జ‌న‌సేన అధినేత, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో హీట్‌ను మ‌రింత పెంచాయి. కాగా ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన నాటి నుంచి నిన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌కు ఫ‌లితాలు వ‌చ్చాక చూద్దాం.., అప్పుడే మాట్లాడుదాం.., అంటూ ప‌లు ప్ర‌శ్న‌ల‌కు సమాధానాల‌ను దాట‌వేసిన సంగ‌తి తెలిసిందే. అటువంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నామంటూ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిని మ‌రింత పెంచాయి.

ప‌వ‌న్ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో ప‌లు భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఏపీలో జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్ప‌డాలంటే మెజార్టీ అసెంబ్లీ స్థానాల‌ను గెలుపొందాల్సిన అవ‌స‌రం ఉంది. తాజా రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా అది అసాధ్య‌మ‌ని జ‌న‌సేన శ్రేణులే చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌లో మాదిరి క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ మాదిరి ఇక్క‌డ కూడా జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్పాటు చేయొచ్చేమో అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేస్తున్నారు. మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుకున్న విధంగా ఏపీలో హంగ్ ఏర్ప‌డితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం కావొచ్చేమోనంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ క‌న‌పడుతున్నాయి.