ఎన్నిక‌ల్లో ఓడిపోతాన‌ని ముందే తెలుసు.. కానీ : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

0
155

అమెరికాలోని వాషింగ్ట‌న్ డీసీ వేదిక‌గా తానా సంబ‌రాలు అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్నాయి. మూడు రోజుల వేడుక‌ల్లో భాగంగా ప్రత్యేక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకుంటున్నాయి. తెలుగువారంతా ఒక‌చోట చేరిన ఈ వేడుక‌లో తెలుగుద‌నం ఉట్టిప‌డ‌లా చేసిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు మంత్ర‌ముగ్దుల‌ను చేశాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ప‌లువురు రాజ‌కీయ‌, సినీ దిగ్గ‌జాలు ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. రెండో రోజు తానా స‌భ‌ల్లో జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మెరిసి ప్ర‌సంగించారు.

తాను స‌భ‌కు వ‌చ్చిన కొంత సేప‌టి త‌రువాత స్టేజ్‌పైకి రావొచ్చేమోన‌ని భావించాన‌ని, కానీ వ‌చ్చిన వెంట‌నే త‌న‌ను స్టేజ్‌పైకి పిల‌వ‌డం కొంత ఇబ్బందిని క‌లిగించింద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. త‌న‌కు చాలాసార్లు తానా స‌భ‌ల ఆహ్వానం అందింద‌ని, కానీ ఒక అసోసియేష‌న్‌ను కాద‌ని మ‌రొక అసోసియేష‌న్‌కు వెళితే కోప్ప‌డ‌తార‌న్న ఉద్దేశంతో తాను ఇంత వ‌ర‌కు తానా స‌భ‌ల్లో పాల్గొన‌లేద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. విదేశాల్లో స్థిర‌ప‌డినా తెలుగు సంస్కృతిని కాపాడుతున్న వారంద‌కీ త‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అలాగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఓట‌మి గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తావించారు. తాను జ‌న‌సేన‌ను దీర్ఘాలోచ‌న‌తోనే స్థాపించాన‌న్నారు. సినిమాల్లో త‌న‌కు చాలా అద్భుత‌మైన కెరియ‌ర్ ఉంద‌న్నారు. కానీ, స‌రికొత్తత‌రం గుండెల్లో ఉండే ఆవేద‌న‌ను వినిపించే బ‌ల‌మైన గొంతుక కావాల‌న్న ఉద్దేశంతో తాను జ‌న‌సేన‌ను స్థాపించార‌న్నారు సినిమాల్లో గంట‌ల‌కొద్దీ డైలాగ్‌లు చెప్ప‌డం వేర‌ని, ఛాలెంజ్‌లు చేయ‌డం వేరని, కానీ నిజ జీవితంలో మాట్లాడాలంటే.. చాలా గుండె ధైర్యం కావాలని ప‌వ‌న్ క‌ళ్యాన్ అన్నారు.