డ‌బ్బులు ఖ‌ర్చుపెట్టి అధికారం చేప‌ట్టారు.. ఇక‌పై రాకీయం చేస్తా : ప‌వ‌న్‌

0
146

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మికిగ‌ల కార‌ణాల‌పై వ‌రుస స‌మీక్ష‌లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంతానే విజ‌య‌వాడ‌లోని జ‌న‌సేన ప్ర‌ధాన కార్యాల‌యానికి అన్ని జిల్లాల పార్టీ శ్రేణుల‌ను పిలిచి మ‌రీ స‌మీక్ష‌లు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే, ఆదివారం నాడు తిరుప‌తి జ‌న‌సేన శ్రేణుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్య‌క‌ర్త‌ల‌పైనే సీరియ‌స్ అయ్యారు. ఓట‌మికి కార‌ణాలు, భ‌విష్య‌త్తులో పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఒక కార్య‌క‌ర్త కాగితంపై రాసి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అంద‌జేశారు. అందులో ప్ర‌ధానంగా పార్టీలోని లోపాల‌ను ఆ కార్య‌క‌ర్త ప‌వ‌న్‌కు తెలియ‌జేశాడు.

అయితే, కార్య‌క‌ర్త రాసిచ్చిన స‌ల‌హాల‌ను చ‌దివిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేశంతో, ఆగ్ర‌హంతో కార్య‌క‌ర్త‌లు ఉన్న గ‌దిలోకి వ‌చ్చారు. పార్టీకి ఓటేయ‌కుండా, స‌ల‌హాలు ఇచ్చే అర్హ‌త లేదంటూ మండిప‌డ్డారు. పార్టీకి ఓటేయ‌కుండా స‌ల‌హాలు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ఆశ‌యాల కోసం నిల‌బ‌డ‌లేనివారు స‌ల‌హాలు ఇవ్వొద్ద‌న్న ప‌వ‌న్ ముందు పార్టీకి ఓటేసి మాట్లాడాల‌ని గ‌ట్టిగా చెప్పారు.

ఆశ‌యాల కోసం అవ‌స‌ర‌మైతే తాను చ‌స్తాన‌ని ప‌వ‌న్ ఆవేశంగా చెప్పారు. ఎన్నిక‌ల్లో విచ్చ‌ల‌విడిగా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆశ‌యాల కోసం ప‌నిచేశాన‌ని, ఇక‌పై రాజ‌కీయం చేస్తాన‌ని ప‌వ‌న్ చెప్పారు.