చిరంజీవి పేరు చెప్తూ కన్నీరు పెట్టుకున్న జనసేనాని..!

0
155

2014 ఎన్నికలకు ముందు తాను బలమైన నిర్ణయం తీసుకుని జనసేన పార్టీని స్థాపించి, టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ నేతగా ఉన్న తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని చాలా బాధ పెట్టానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలా టీడీపీకి, బీజేపీకి మద్దతు ఇవ్వడానికి గల కారణం బిడ్డల భవిష్యత్ బావుంటుంది అన్న ఒక్క కారణం మాత్రమేనన్నారు.

జనసేన నేత నాదెండ్ల మనోహర్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నిండు నూరేళ్లు ప్రజాసేవలో ఉండి, ప్రజలకు అందకుండా పోయిన అభివృద్ధిని వారికి అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు. నాదెండ్ల మనోహర్ జనసేనలోకి వచ్చినప్పుడు తాను చాలా ఆనంద పడ్డానని, తనకు ఓకే అన్నలా నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యక్రమాల్లో సహాయపడుతూన్నారన్నారు.