మల్లి ఫ్యాక్షన్ మొదలు పెట్టొద్దు : ప్రకాశ్ రెడ్డీకి, పరిటాల సునీత వార్నింగ్

0
187
మల్లి ఫ్యాక్షన్ మొదలు పెట్టొద్దు : ప్రకాశ్ రెడ్డీకి, పరిటాల సునీత వార్నింగ్
మల్లి ఫ్యాక్షన్ మొదలు పెట్టొద్దు : ప్రకాశ్ రెడ్డీకి, పరిటాల సునీత వార్నింగ్

నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల పోలింగ్ ను చూస్తే భీహార్ లాంటి రాష్ట్రలను మించిన మరణకాండ జరిగింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎక్కడ చూసిన దాడులు, ప్రతిదాదులు, మారణకాండ.. ప్రజలు ఓటు వేస్తుంది వారి భవిష్యత్ కోసమో.. లేక తమ అభిమాన నాయకుడికోసమో వారికే తెలియని పరిస్థితుల మద్య ఎలాగోలా పోలింగ్ ముగిసింది. ఈ సందర్భంగా APలో పలు చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే.

మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా “రాప్తాడు” నియోజకవర్గంలో సైతం దాడులు జరిగాయి. TDP అభ్యర్థి “పరిటాల శ్రీరామ్” ను వైసీసీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆయన వాహనాలపై రాళ్లు రువ్వాయి. ఈ నేపథ్యంలో జిల్లా SPకి “పరిటాల సునీత” గారు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె YCP అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ ను భయిరంగంగానే హెచ్చరించింది.

“ప్రకాశ్ రెడ్డీ, మీకు నేను ఒకటే చెబుతున్నా… 14 ఏళ్ల క్రితమే మా కుటుంబం ఫ్యాక్షన్ వదిలేసింది.. నాటి నుండి ఇప్పటివరకు శాంతియుతంగా ఉన్నాం… కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తున్నాం.. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఫ్యాక్షన్ ను ప్రారంభించేందుకు ప్రయత్నించవద్దు…  మాపై దాడులకు ఉసిగొల్పడం మానుకోండి” అంటూ ప్రకాశ్ రెడ్డీకి వార్నింగ్ ఇచ్చారు సునీత.