చంద్రబాబు పిలుపుతో దేశం మొత్తం కదిలింది : పరిటాల సునీత

0
109

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కి “ప్రత్యేక హోదా” కావాలని ఎవరు ఎన్ని దీక్షలు, నిరాహార దీక్షలు చేసిన ఎలాంటి ఉపోయోగం లేదని, కానీ అదే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక్క పిలుపుతో దేశం మొత్తం కదిలిందని.. కాబట్టి ఈ రాష్ట్రనికి ప్రత్యేక హోదా తీసుకురావాలి అంటే అది ఒక బాబుగారి వల్లే అవుతుందని చెప్పుకొచ్చారు మంత్రి పరిటాల సునీత.

జిల్లాలోని రామగిరి మండల కేంద్రంలో నిరసన దీక్షలో పాల్గొన్న ఆమె..” ఇది న్యాయం కోసం చేస్తున్న దీక్ష.. కేంద్రం మన రాష్ట్రానికి సాయం చేయకపోగా అభివృద్ధిని అడ్డుకుంది.. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? అమరావతికి వచ్చిన మోదీ మట్టీ కుండ, నీరు మన మొహాన వేశారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రతిపక్ష నేత అయిన జగన్ ఏ ఒక్కరోజూ మాట్లాడలేదని.. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ గుంటూరుకు వస్తే జగన్ తన పార్టీ కార్యకర్తలని ఆ సభకు పంపించారని ఆరోపించారు. మన అనంతపురం జిల్లాకు “కియా” వంటి పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు గారిదే అని.. మరీ ముఖ్యంగా కేంద్రం సహకరించక పోయినా రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. అదే కేంద్రం సహకరించి ఉంటే మరింత అభివృద్ది చేసేవాళ్లమని సునీత అన్నారు.