వివేకానందరెడ్డి హత్యా కేసులో కీలక మలుపు : పరమేశ్వరరెడ్డి ఆచూకీ ల‌భ్యం

0
443
వివేకానందరెడ్డి హత్యా కేసులో కీలక మలుపు : పరమేశ్వరరెడ్డి ఆచూకీ ల‌భ్యం
వివేకానందరెడ్డి హత్యా కేసులో కీలక మలుపు : పరమేశ్వరరెడ్డి ఆచూకీ ల‌భ్యం

మాజీ మంత్రి YS వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నింధుతుడిగా భావిస్తున్న పరమేశ్వరరెడ్డి ఆచూకీ దొరికింది. వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయం నుండి పరమేశ్వరరెడ్డి కనిపించకపోవడంతో.. అతడే ఈ హత్య చేసుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ పరమేశ్వరరెడ్డి మాత్రం ఆ హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నాడు. నిజానికి గత కొన్నిరోజులుగా తనకు ఆరోగ్యం బాగాలేనందున తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని మీడియాతో మాట్లాడాడు.

వివేకానందరెడ్డి కుటుంబంతో తనకు 20 ఏళ్లుగా సన్నిహిత  సంబంధం ఉంది.. నేను ప్రాణాలిచ్చేవాడినేగానీ.. ప్రాణాలు తీసేవాడిని కాదని పరమేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు “పరమేశ్వరరెడ్డి” తిరుపతిలో ఉన్నారని తెలిసి సిట్ బృందం అక్కడికి బయలు దేరింది. పరమేశ్వరరెడ్డి దొరికితే కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉందని భావించిన పోలీసులకు ఆయన ఆచూకీ తెలియడంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. మరికొన్ని గంటల్లోనే ఆస్పత్రిలో ఉన్న పరమేశ్వరరెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.