ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ఆరోగ్యంపై చంద్ర‌బాబు వాక‌బు..!

0
266

పుట్ట‌ప‌ర్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ఆరోగ్య ప‌రిస్థితిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వాక‌బు చేశారు. ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుండ‌టంతో ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి కుమారుడు కృష్ణ కిశోర్‌తో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి త్వ‌ర‌గా కోలుకోవాలని కోరుకుంటున్న‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలిపారు.

కాగా, గురువారం నాడు ప‌ల్లెర‌ఘు నాథ‌రెడ్డి త‌న స‌తీమ‌ణి స‌మాధి వ‌ద్ద నివాళులు అర్పించేందుకు వెళ్లిన స‌మ‌యంలో ఆయ‌న అక్క‌డే తీవ్ర చాతినొప్పితో కూల‌బ‌డ్డారు. వెంట‌నే ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిని ఆయ‌న అనుచ‌రులు చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ఆరోగ్యం బాగుంద‌ని వైద్యులు వెల్ల‌డించారు.

Breaking….పల్లె రఘునాథరెడ్డి కి గుండె పోటుతన భార్య సమాధి వద్ద కుప్ప కూలిన పల్లెహుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

Posted by T Naveen Chowdary on Wednesday, April 10, 2019