డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేని టీడీపీ ఒకేఒక్క‌డు

0
170

అధికార పార్టీనుంచి బ‌రిలోకి దిగి డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయిన టీడీపీ అభ్యర్థి ఒకే ఒక్క‌డున్నారు. ఆయ‌నెవ‌రోకాదు. మాజీ మంత్రి ‘కిడారి’. మావోయిస్టుల చేతిలో తండ్రిని కోల్పోయిన కిడారి శ్రావణ్‌కుమార్‌కు చంద్రబాబునాయుడు ఏకంగా మంత్రి పదవిని అప్పగించారు. సీనియర్లను కాదని ఆయనకే ఈ ఎన్నికల్లో అరకులోయ ఎమ్మెల్యే టిక్కెట్‌ను ఇచ్చారు. అయితే ఆయ‌న కనీసం డిపాజిట్‌ నిలుపుకోలేకపోయారు.

గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేక మూడో స్థానానికి పరిమితమయ్యారు. పోలైన ఓట్లలో 1/6 శాతం ఓట్లు పొందిన వారికే డిపాజిట్‌ దక్కుతుంది. ఆ లెక్కన ఇక్కడ 1,57,575 ఓట్లు పోలవ్వగా… డిపాజిట్‌ దక్కాలంటే కనీసం 26,263 ఓట్లు రావాలి. కానీ మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌కు కేవలం 19,929 ఓట్లు మాత్రమే వ‌చ్చాయి.