గ్యాంగ్‌రేప్ గ్యాంగ్ అరెస్ట్

0
100

గుంటూరుకు చెందిన బాలికపై ఒంగోలులో ఆరురోజుల‌పాటు నిర్భంధించి గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును ఒంగోలు పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. తల్లి మందలించిందని ఇల్లు విడిచి ఒంగోలు చేరుకున్న బాలికను ఆరుగురు యువకులు మభ్యపెట్టి గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ కేసులో ముగ్గురు మైనర్లు సహా మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదివారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు ఘటన వివరాలు వెల్లడించారు.