చాక్లెట్ ఇస్తానంటేనే.. శృంగారంలో పాల్గొనేవాడు..!

0
1560

నా అస‌లు పేరు సునీత‌, నేను ఒక ఇండియ‌న్‌ని. నా బాల్యం అంతా ఇండియాలోనే కొన‌సాగింది. బాల్యంలోనే లైంగిక వేధింపుల‌కు గుర‌య్యా. ఖాన్ అనే వ్య‌క్తి నాపై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆ స‌మ‌యంలో అత‌ను న‌న్ను ఏం చేస్తున్నాడో కూడా తెలియ‌లేదు. నా త‌ల్లిదండ్రులూ గ‌మ‌నించ‌లేదు. నాకు యుక్త వ‌య‌స్సు వచ్చాక పెళ్లిచేసి అత్తారంటికి పంపించేశారు. అత్తారింటిలో అడుగుపెట్టిన తొలి రాత్రే తెలిసొచ్చింది.. నేను అడుగుపెట్టింది అత్తారింటిలో కాదు.. య‌మ‌పురిలో అని. అదే నా చివ‌రి రోజ‌నుకున్నా.. కానీ దేవుడి ద‌య‌వ‌ల్లే నేను ఇంకా బ‌తికున్నాఅంటూ ఇంగ్లండ్‌కు చెందిన స‌న్నీ యాంజిల్ అనే 40 ఏళ్ల మ‌హిళ తాను రాసిన వింగ్స్ అనే పుస్త‌కంలో పేర్కొంది.

స‌న్నీ యాంజిల్ తాను రాసిన వింగ్స్ పుస్త‌కంలో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పెళ్లైన మొద‌టి రోజు శోభ‌నం గ‌దిలోకి తెల్ల‌చీర‌, పాల గ్లాసుతో లోప‌లికి వెళ్లిన త‌న‌కు భ‌ర్త మతిస్థిమితం లేని వ్య‌క్త‌న్న విష‌యం తెలిసొచ్చింద‌ని, ఆయ‌న‌కు పెళ్లంటే ఏమిటో..? శోభ‌నం అంటే ఏమిటో..? ఫ‌్యామిలీ అంటే ఏమిటో..? అన్న విష‌య‌లు అస్స‌లు తెలియ‌వ‌న్న విష‌యాలు స్ప‌ష్ట‌మ‌య్యాయ‌న్నారు.

నా త‌ల్లిదండ్రులు, ఏదో ఆడ పిల్ల పుట్టింది క‌దా..! పెళ్లి చేసి అత్తారంటికి పంపించేద్దాం అన్న హ‌డావుడిలో పెళ్లిచేసుకోబోయే వ్య‌క్తి మ‌న‌స్త‌త్వం, మ‌తిస్థిమితం బాగాలేద‌న్న విష‌యాన్ని గుర్తించ‌లేక‌పోయార‌ని, ఆ స‌మ‌యంలో త‌న త‌ల్లిదండ్రుల‌ను గుర్తు తెచ్చుకుని క‌న్నీరు మున్నీరై విల‌పించిన‌ట్టు స‌న్నీ యాంజిల్ వింగ్స్ పుస్త‌కంలో తెలిపింది.

అయితే, శోభ‌నం అంటే ఏమిటో తెలియ‌ని నా భ‌ర్త‌కు ఆయ‌న త‌ల్లి (అత్త‌) ఫోర్న్ వీడియోలు చూపిస్తూ, కిటికీలో నుంచి చూస్తూ శోభ‌నం స‌రిగ్గా జ‌రుగుతుందా..? లేదా..? ఎలా చేయాలి..? ఏంట‌న్న విష‌యాల‌ను నా భ‌ర్త‌కు చెప్తుండేది. ఆ సంఘ‌ట‌న‌ల‌ను త‌లుచుకుంటుంటే నాకు ఇప్ప‌టికీ కంట‌నీరు ఆగ‌డం లేదు. అలా మా అత్త చెప్పిన‌ట్టు శృంగారంలో పాల్గొన్న నా భ‌ర్త‌.. చివ‌ర‌గా అమ్మా… శృంగారం అయిపోయింద‌మ్మా.. ఇప్పుడైనా చాక్లెట్ ఇవ్వ‌వే అని అడుగుతూ త‌లుపులు తీసి బ‌య‌ట‌కు వెళ్లేవాడ‌ని స‌న్నీ యాంజిల్ త‌న పుస్త‌కంలో రాసుకొచ్చింది.

ఇటువంటి సంఘ‌ట‌న‌లు కేవ‌లం నా జీవితంలోనే కాదు, ప్ర‌తి రోజు.. ఏదో ఒక ప్రాంతంలో.. జ‌రుగుతూనే ఉన్నాయి. అందులో నేనూ ఒక‌దాన్ని, కొంద‌రు త‌ల్లిదండ్రులు కూతుళ్ల‌ను ఎలా వ‌దిలించుకోవాల‌ని చూస్తున్నారే త‌ప్ప‌.. అత్తారంటికి వెళ్లాక ప‌రిస్థితి ఏంటి..? అక్క‌డి మ‌నుషులు ఎలాంటి మ‌న‌స్త‌త్వం క‌లిగిన వారు అన్న విష‌యాల‌పై ఆరా తీయ‌డం లేద‌ని స‌న్నీ యాంజిల్‌ వింగ్స్ పుస్త‌క రూపంలో స‌మాజాన్ని ప్ర‌శ్నించింది.

ఇలా త‌న మ‌తి స్థిమితం లేని భ‌ర్త‌తో కాపురం చేయ‌లేక‌, అత్త‌పెట్టే వేధింపుల‌ను త‌ట్టుకోలేక పెళ్లైన నాలుగు నెల‌ల‌కే విడాకుల రూపంలో అత్తారింటి బంధాన్ని తెంచుకున్నాన‌ని తెలిపింది. విడాకుల‌కు ముందు భ‌ర్త‌కు శృంగారంలో స‌హ‌క‌రించ‌లేద‌న్న నెపంతో అత్తారింటి స‌భ్యులెవ్వ‌రు కూడా త‌న‌కు అన్నం పెట్టే వారు కాద‌ని, దీంతో నీర‌సించిన తాను హాస్పిట‌ల్‌లో చేరాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది. ప్ర‌స్తుతం నా వ‌య‌స్సు న‌ల‌భై ఏళ్లు, ఇంగ్లండ్‌లో స‌రీలో ఒంట‌రిగానే నివాసం ఉంటున్నానంటూ స‌న్నీ యాంజిల్ పుస్త‌కావిష్క‌ర‌ణలో భాగంగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.