‘ఓ బేబీ’ టీజర్ లో సమంతను చూశారా..?

0
277
oh baby teaser

సినిమా సినిమాకు గ్లామర్ పెంచేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అక్కినేని సమంత నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘ఓ బేబీ’ సినిమాలో ఒక కొత్త ప్రయోగాత్మకమైన పాత్రను పోషిస్తుంది. కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ కు రీమేక్ గా చేస్తున్న సినిమాలో సామ్ వృద్ధురాలుగా కనిపించబోతుంది. ఇప్పటికే అనుష్క బాహుబలిలో వృద్దురాలిగా కనిపించింది. కాజల్ అగర్వాల్ భారతీయుడు 2 లో వృద్ధురాలి పాత్రలో కనిపించబోతుంది. ఆ తరహాలోనే సామ్ కూడా అడుగుపెట్టింది. గ్లామర్ రోల్ కన్నా కథ ప్రాముఖ్యత గల పాత్రలోనే చేయుటకు మొగ్గు చూపుతున్నారు ఈ తరం హీరోయిన్స్. సామ్ నటించబోవు సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్టులుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా నుంచి టీజర్ ని వదిలారు చిత్ర బృందం.

టీజర్ లో నాగశౌర్య యంగ్ సామ్ ని బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా అని ప్రశ్నిస్తాడు వెంటనే సమంత ” నేను మంచి వయస్సులో ఉన్నపుడే మా ఆయన పోయాడు. అప్పటికే నాని గాడు పుట్టేశాడు.. ఇంకా పెళ్లి పెటాకులెందుకని వాన్ని పెంచి, పెద్ద చేశా.. వాడు పెళ్లి చేసుకొని ఇద్దరిని కన్నాడు. వాళ్ళు కూడా పెళ్ళీడుకొచ్చేశారు. నాకు వయస్సు అయిపోయింది.” అనే డైలాగ్ చెప్తుంది. యంగ్ సామ్ జీవితం లో ఈ సంఘటనలేంటాని.. ఆశ్చర్యానికి గురి చేస్తుంది సీన్.. మరో వైపు ‘నాతో ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు.. ఒక్కొక్కడికి చూస్తారుగా’ అనే సామ్ డైలాగ్ సినిమా మీద ఆసక్తిని రేపుతున్నాయి.

వృద్ధిరాలి సామ్ కి జోడిగా రాజేంద్రప్రసాద్, అమ్మాయి సామ్ కి జోడిగా నాగశౌర్య నటిస్తున్నారు. సీనియర్ నటి లక్ష్మీ, ఊర్వశి, రావు రమేశ్ తదితరులు నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సామ్ తప్పక అందరిని మెప్పిస్తుందని నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.