న‌ర్సుతో కానిస్టేబుల్ స‌హ‌జీవ‌నం.. రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న‌ భార్య‌..!

0
371

అత‌ను ఎక్సైజ్ కానిస్టేబుల్ అంత‌క‌న్నా మించిన విలాస పురుషుడు చిత్తూరు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఉద్యోగం, దీంతో రాబ‌డికి కొద‌వే లేదు. ఈ మాత్రం చాలు చెల‌రేగిపోవ‌డానికి అనుకున్నాడు. పెళ్లాం, పిల్ల‌ల‌ను న‌డిరోడ్డుపాలు చేసి స‌హ‌జీవ‌న‌మ‌ని, వివాహేత‌ర సంబంధాల‌ని ఇలా అత‌డి ఆగ‌డాల‌కు అంతే ఉండ‌దు. పెళ్లాం, పిల్ల‌ల్ని చిత్ర హింస‌లు చేస్తుంటే అడిగేవాళ్లు లేరు. పైపెచ్చు డిపార్ట్‌మెంట్‌కు ఇలాంటివాడు ఒక‌డున్నాడ‌న్న రీతిలో అధికారులు సైతం వంత‌పాడారు.

పై ఫోటోలోని ఈ న‌వ మ‌న్మ‌ధుడ్ని చూశారుగా, అత‌ని పేరు రామ‌లింగయ్య‌. చిత్తూరు ఎక్సైజ్ శాఖ‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఇత‌డి పేరు రామ‌లింగ‌య్య‌. ఇత‌డు సామాన్యుడు కాదు. కానిస్టేబుల్‌గా ఎలాంటి సామర్ధ్యం చూపుతున్నాడో తెలీదు కానీ.. క‌ట్టుకున్న భార్య‌ను చిత్ర‌హింస‌లు పెట్ట‌డంలో ఇత‌ర మ‌హిళ‌ల‌తో వివాహేత‌ర సంబంధాలు నెర‌ప‌డంలో మాత్రం ఎక్స్‌ప‌ర్ట్‌.

అయితే, కానిస్టేబుల్ రామ‌లింగ‌య్య‌కు శ్రీ‌వ‌ల్లి అనే మ‌హిళ‌తో 2000 సంవ‌త్స‌రంలో పెళ్లైంది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ( అమ్మాయి, అబ్బాయి). ఒక‌రు డిగ్రీ, మ‌రొక‌రు ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. గ‌త నాలుగేళ్ల నుంచి రామ‌లింగ‌య్య ఓ న‌ర్సుతో వివాహేత‌ర సంబంధం పెట్టుకుని ఆమెతో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు.

కేవ‌లం వివాహేత‌ర సంబంధ‌మే కాదు..!

కేవ‌లం మ‌హిళా న‌ర్సుతో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని అనుకుంటే పొర‌పాటే. ఇత‌డికి ఆమెతోనే కాదు. మ‌రెంద‌రో స్త్రీల‌తో వివాహేత‌ర సంబంధాలు ఉన్నాయి. పెళ్లాం పిల్ల‌ల్ని గాలికి వ‌దిలి బ‌లాదూర్‌గా తిరిగే ఇత‌డ్ని క‌ట్ట‌డి చేసే అవ‌కాశమే లేకుండా పోయింది శ్రీ‌వ‌ల్లికి.

కానిస్టేబుల్ లింగ‌య్య‌పై శ్రీ‌వ‌ల్లి ఎన్నిసార్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా నో రియాక్ష‌న్‌. కానిస్టేబుల్‌గా ఉన్న‌ రామ‌లింగ‌య్య త‌నపై వ‌చ్చిన ఫిర్యాదుల‌ను అడ్డుకునేవాడు. కేసు ఫైల్ కాకుండా చూసుకునేవాడు.

అనేక కంప్లైంట్‌ల త‌రువాత కూడా రామ‌లింగ‌య్య‌, శ్రీ‌వ‌ల్లికి మధ్య ఎన్నోసార్లు గొడ‌వ‌ల‌య్యాయి. చివ‌ర‌కు నిన్నే కాదు.. పిల్ల‌ల్ని కూడా ప‌ట్టించుకోనంటూ రామ‌లింగ‌య్య తెగేసి చెప్పేవాడు. స‌రే, రామ‌లింగ‌య్య‌పై త‌న డిపార్ట్‌మెంట్‌లో ఫిర్యాదు చేస్తే అయినా మారుతాడేమోన‌ని ఆశిస్తే.. అక్క‌డా అడియాశే. ఈమెప‌డుతున్న పాట్లు గురించి ఎక్సైజ్ అధికారులెవ్వ‌రికీ క‌నీసం ప‌ట్ట‌లేదు. త‌మ డిపార్ట్‌మెంట్‌లో ఇలాంటి కామాంధుడు, బ్లాక్‌మెయిల‌ర్‌, చీడ‌పురుగు ప‌నిచేస్తున్నాడ‌న్నా క‌నీసం చీమ‌కుట్టిన‌ట్టుగా కూడా లేదు. పైపెచ్చు రామ‌లింగ‌య్య‌కే పోలీసు డిపార్ట్‌మెంట్ స‌పోర్టు చేస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది శ్రీ‌వ‌ల్లి.

ఫోటోల‌తో యువుత‌ల‌ను బ్లాక్‌మెయిల్..!

అయితే, రామ‌లింగ‌య్య‌కు మ‌రో అల‌వాటు కూడా ఉంది. అమ్మాయిల‌తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేవాడు. ఈ ఫోటోలు పైకి స‌ర‌దాగా తీసుకున్న‌ట్టు అనిపించినా.. ఆ ఫోటోల‌తో యువుత‌ల‌ను బ్లాక్‌మెయిల్ చేసి ప‌దే ప‌దే హింసించేవాడ‌ని ఆరోపిస్తోంది శ్రీ‌వ‌ల్లి.రామ‌లింగ‌య్య తీసిన సెల్ఫీలు, వీడియోల ఆధారంగానే బాధితురాలు అత‌న్ని ప‌ట్టించింది. అత‌ని సెల్‌ఫోన్‌లోని ఫోటోల‌తో స‌హా మీడియా ముందుకు వ‌చ్చింది. రామ‌లింగ‌య్య ద్వారా తాను ఎన్ని క‌ష్టాల‌ను ఎదుర్కొందో పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించింది శ్రీ‌వ‌ల్లి.

ఇళ్లాలి క‌ష్టాలు..!

త‌మ ఎక్సైజ్‌శాఖ‌లో ప‌నిచేసే ఒక కానిస్టేబుల్ ద్వారా ఒక మ‌హిళ ఇన్నేసి ఇబ్బందులు ప‌డుతుంటే అత‌డిపై అధికారులు చ‌ర్య‌లు తీసుకోకుండా చోద్యం చూస్తున్నార‌ని తెలుస్తుంది. ఇత‌డి కార‌ణంగా అనారోగ్యంపాలై తాను అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నాన‌ని వాపోతుంది శ్రీ‌వ‌ల్లి. ఇంత జ‌రుగుతుంటే రామ‌లింగ‌య్య ప‌నిచేసే ఎక్సైజ్‌శాఖలో క‌నీసం చ‌ల‌నం ఉన్న‌ట్టే క‌నిపించ‌దు. డిపార్ట్‌మెంట్‌కు ఇలాంటి వారే అవ‌స‌ర‌మో ఏమో తెలీదు. రామ‌లింగ‌య్య మీద ఇప్ప‌టికీ చ‌ర్య‌లు తీసుకోలేదు. చివ‌ర‌కు శ్రీ‌వ‌ల్లికి అండ‌గా మీడియా నిల‌వ‌డ‌టంతో నామ్‌కే వాస్తిగా ఫిర్యాదు తీసుకున్నారు.

కానిస్టేబుల్ రామ‌లింగ‌య్య పెద్దఎత్తున దందాచేసి మిగిలిన అధికారుల‌కంతా డ‌బ్బు పంప‌కాలు సాగిస్తున్నాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ఇత‌డిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు ఈ డిపార్ట్‌మెంట్ ఉన్న‌తాధికారులు ఇష్ట‌ప‌డ‌ర‌ని తెలుస్తుంది. మ‌రి ఇక‌నైనా శ్రీవ‌ల్లికి, ఆమె పిల్లల‌కు న్యాయం జ‌రుగుతుందా..? లేక ఎప్ప‌టి లాగానే గాలికి వ‌దిలేస్తారా..? అన్న‌ది చూడాలి.