ఎన్టీఆర్ ట్ర‌స్ట్ మ‌రో సేవా దృక్ప‌థం..!

0
146

నిరంత‌ర సేవా కార్య‌క్ర‌మాల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ మ‌రోసారి త‌న మాన‌వ‌తా దృక్ప‌థాన్ని చాటుకుంది. 80 మంది త‌ల‌సీమియా బాధితుల‌ను ద‌త్త‌త తీసుకుంది. వారి ఆరోగ్య‌ప‌ర‌మైన ప్ర‌తి అంశాన్ని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ ద‌గ్గ‌రుండి చూసుకోనుంది. ఈ విష‌యాన్ని ఆ సంస్థ యాజ‌మాన్యం ఈ రోజు అధికారికంగా తెలిపారు.

కాగా, 80 మంది త‌ల‌సీమియా బాధితుల‌ను ద‌త్త‌త తీసుకునే కార్య‌క్ర‌మంలో ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్లోని దివంగ‌త సీఎం ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళులు అర్పించిన ఆమె ఆ త‌రువాత స‌భ‌లో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ర‌క్త‌దానం చేసిన ప్ర‌తి ఒక్క‌రికి ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.