ఎన్టీఆర్ సినిమా కోసం దొంగ‌త‌నం చేశా : న‌టుడు అలీ

0
132

అవును, ఎన్టీఆర్ సినిమా కోసం దొంగ‌త‌నం చేశా. ఆ స‌మ‌యంలో దొంగ‌త‌నం చేయ‌క త‌ప్ప‌లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే నాకు అంత ఇష్టం. ఆ ఇష్టమే నేను దొంగ‌త‌నం చేసేలా ఉసిగొల్పింద‌ని ప్ర‌ముఖ టాలీవుడ్ హాస్య న‌టుడు అలీ తెలిపారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో న‌టుడు అలీ మాట్లాడుతూ త‌న జీవితంలో జ‌రిగిన కొన్ని ఆస‌క్తికర సంఘ‌ట‌న‌ల‌ను చెప్పుకొచ్చారు.

మొద‌ట‌గా త‌న ఆస్తుల‌కు సంబంధించి మాట్లాడారు. త‌న‌కు 13 కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయ‌ని, ఎవ‌రో క‌ట్టుకున్న బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నాలు చూపించి అది న‌టుడు అలీదేనంటూ ఫోటో ఒక‌టి త‌యారు చేసి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నార‌ని, ఆ బ‌హుళ అంతస్థు భ‌వ‌నం, ఆ రూ.13 కోట్ల వీడియోలు అన్నీ కూడా ఫేక్ అంటూ న‌టుడు అలీ స్ప‌ష్టం చేశారు. త‌న న‌ట‌న‌ను మెచ్చి సినిమాల్లో అవ‌కాశాలు ఇవ్వ‌డంతో ఎంతోకొంత సంపాదించుకున్నామ‌ని, అవ‌న్నీ కూడా దేవుడు త‌మ‌కు ఇచ్చిన బ‌హుమ‌తిగానే తాము భావిస్తామ‌ని న‌టుడు అలీ చెప్పారు.

ఇక ఎన్టీఆర్ సినిమా కోసం దొంగ‌త‌నం విష‌యం గురించి చెప్తూ.. సీనియ‌ర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయ‌న న‌టించిన య‌మ‌గోల సినిమా చూద్దామ‌ని మా నాన్న‌గారి జేబులో నుంచి రూ.2లు కొట్టేశా. ఆ రూ.2ల్లో టికెట్‌కు రూ.1, స్నాక్స్‌కు మ‌రో రూ.1 ఖ‌ర్చు పెట్టాన‌ని, త‌న జీవితంలో చేసిన మొద‌టి, చివ‌రి దొంగ‌త‌నం అదేన‌ని న‌టుడు అలీ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.