ఎన్టీఆర్ సినిమా ప్రారంభంలో భ‌య‌ప‌డ్డాను : సీఎం చంద్ర‌బాబు

0
101

దివంగ‌త సీఎం నంద‌మూరి తార‌క రామారావు వంటి న‌టుడు మ‌రొక‌రు ఉండ‌రు.. ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. కాగా, గురువారం న‌టుడు హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు క్రిష్‌ల‌తో క‌లిసి సీఎం చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ క‌థా నాయ‌కుడు చిత్రాన్ని చూశారు.

అనంత‌రం సీఎం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ సినిమా చూస్తున్న‌ ఆద్యాంతం త‌న‌కు ఎన్టీఆరే మ‌ళ్లీ పుట్టి బాల‌కృష్ణ రూపంలో వ‌చ్చిన‌ట్లుగా అనిపించింద‌న్నారు. ఎన్నో పాత్ర‌లు వేసిన ఎన్టీఆర్‌ను బాల‌కృష్ణ తెర‌పై అద్భుతంగా చూపార‌న్నారు. ఎన్టీఆర్ లాంటి వ్య‌క్తియొక్క జీవితాన్ని తెర‌కెక్కించ‌డ‌మ‌నేది ఒక సాహ‌సం. ఎందుకంటే రాజ‌కీయాల్లోకానీ, సినిమాల్లో కానీ ఎన్టీఆర్‌తో ఎవ్వ‌రూ పోటీ ప‌డ‌లేరు.

ఆయ‌న చేసిన‌టువంటి పాత్ర‌లను వేసేందుకు కూడా ఇంత వ‌ర‌కు ఎవ్వ‌రూ సాహ‌సం చేయ‌లేదని, సినిమా ప్రారంభంలో ఎన్టీఆర్ పాత్ర‌ను బాల‌కృష్ణ చేయ‌గ‌లుగుతాడా..? అని నేను కూడా భ‌య‌ప‌డ్డాను. కానీ వెండితెర‌పై బాల‌కృష్ణ‌ను చూసిన త‌రువాత ఎన్టీఆర్‌నే చూసిన‌ట్ట‌నిపించింద‌న్నారు.