విల‌క్ష‌ణ న‌టుడు గిరీష్ క‌ర్నాడ్ క‌న్నుమూత‌..!

0
178

విల‌క్ష‌ణ న‌టుడు గిరీష్ క‌ర్నాడ్ క‌న్నుమూశారు. బెంగ‌ళూరులోని త‌న నివాసంలో ఈ రోజు ఉద‌యం 6.30 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. కాగా, 81 సంవ‌త్స‌రాల గిరీష్ క‌ర్నాడ్ కొంత కాలంగా అనారోగ్య కార‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు క‌న్న‌డ‌, హిందీ చిత్రాల్లో న‌టించి సినీ జ‌నాల‌ను మెప్పించారు. అంతేకాకుండా ప‌లు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి శెభాష్ అనిపించుకున్నారు. ర‌చ‌యిత‌గా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన జ్ఞాన‌పీఠ్ అవార్డు ఆయ‌న్ను వ‌రించింది. అలాగే 1984లో ప‌ద్మ శ్రీ, 1992లో పద్మ‌భూష‌ణ్ అవార్డుతో కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ను స‌త్క‌రించింది. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా ప‌లు జాతీయ అవార్డుల‌ను, ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌ను ఆయ‌న అందుకున్నారు.