మోదీ పై నామినేషన్ వేయకుండా మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు : వెనక్కి తగ్గని పసుపు రైతులు

0
154
మోదీ పై నామినేషన్ వేయకుండా మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు : వెనక్కి తగ్గని పసుపు రైతులు
మోదీ పై నామినేషన్ వేయకుండా మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు : వెనక్కి తగ్గని పసుపు రైతులు

ప్రస్తుతం వరణాసిలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే మోదీ గెలుపు గాలిలో పెట్టిన దీపంలా కనిపిస్తుంది. ఆయనకు పోటీగా 50 మంది పసుపు రైతులు మూకుమ్మడిగా నామినేషన్ వేయబోతున్న విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితం నిజామాబాద్ MP కవితకు పోటీగా అక్కడి “ఎర్ర‌జొన్న‌ రైతులు” MPలు గా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు అదే నిజామాబాద్ కు చెందిన 50 మంది “పసుపు రైతులు” ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా వారణాసిలో నామినేషన్ వేయడానికి సిద్దమయ్యారు.

మేము నామినేషన్ వేయడం వెనక ప్రధాన ఉద్యేశం మోదీని ఓడించడం కాదని.. కేవలం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ మీద పోటీ చేయడం ద్వారా దేశం దృష్టిని ఆకర్షించాలనే మా ప్రధాన ఉద్యేశం అని “పసుపు రైతులు” ఎంత చెప్పినా.. వాల్లమాట ఎవ్వరూ వినడం లేదు. అందుకే వాళ్ళు నామినేషన్ వేయనివ్వకుండా స్థానిక బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుస్తుంది. పైగా వీరికి నామినీ ఇస్తామన్న ఆ ప్రాంత ప్రజలను కూడా స్థానిక బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఏది ఏమైనా.. ఎంతమంది అడ్డుకోవాలని చూసిన ఈ సోమవారం మేము నామినేషన్ వేయడం పక్క అని చెబుతున్నారు పసుపు రైతులు.