ఎన్టీఆర్ ప్రియరాలు నిత్యామీనన్..!

0
151
junior ntr with nithyamenon
nithyamenon acting in RRR movie

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాల్లో తెలుగు టాప్ హీరో లు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటిస్తుండగా, రామ్ సరసన ఆలీయాభట్, ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తున్నట్లు ప్రెస్ మీట్ లో రాజమౌళి ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ సరసన నటించే హాలీవుడ్ అమ్మడు కొన్ని అవాంతరాల వలన నటించట్లేదని మరోసారి అధికారిక ప్రకటన చేశారు చిత్ర యూనిట్.

ఇక దర్శకులు కొత్త హీరోయిన్ వేటలో ఉన్నారు. ఇప్పటివరకు హీరోయిన్ ఎవరు అనేది క్లారిటీ రాలేదు. ఇంతలోనే జూనియర్ ఎన్టీఆర్ సరసన ప్రియురాలి పాత్రలో రెండో హీరోయిన్ గా నటిస్తున్న నిత్యామీనన్ గూర్చి మాత్రం ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. నిత్యామీనన్ ఒక గిరిజన అమ్మాయిగా కనిపించబోతుందట. నిత్యామీనన్ సెకండ్ హీరోయిన్ గా, జూనియర్ ఎన్టీఆర్ కి ప్రియురాలి నటిస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత షెడ్యూల్ నార్త్ ఇండియా లో చేయబోతున్నారు.

రామ్ చరణ్  కాలికి దెబ్బ తగలడంతో ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటున్నాడు. నార్త్ ఇండియా లో షూటింగ్ మొదలవ్వగానే ఆలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని లతో పాటు రామ్ చరణ్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు. డివివి దానయ్య నిర్మాణం లో 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాను 2020 జులై 30న చిత్రాన్ని విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం వారు.