పవన్ ను పలకరించి.. జనసేనకు భారీ విరాళం..! నితిన్

0
189
nithin gave fund to jansena party

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానము చూపించేవారిలో సాధారణ వ్యక్తులే కాకుండా సెలెబ్రెటీలు కూడా చాలా మందే ఉన్నారు. పవన్ ఫ్యాన్స్ లిస్టులో యూత్ స్టార్ నితిన్ ఒకరు. తన సినిమా ఆడియో ఫంక్షన్లకు, ప్రిరిలీజ్ లకు ముఖ్యఅథితిగా పవన్ ఉండాలిసిందే. అంతే కాకుండా తన సినిమాల్లో పవన్ పాటలను రీమేక్ చేస్తుంటాడు. ఇక ఈ సారి జనసేన పార్టీ కి తన వంతుగా అభిమానాన్ని ఎలా తెలిపాడోచూడండి

జనసేన పార్టీ ని జనంలోకి తీసుక వెళ్లే ప్రయత్నం లో ఎన్నికల ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ వడదెబ్బ తగిలి అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో చేరారు. ఈ పరంగా సోమవారం రాత్రి సమయాన బీమవరంలో జనసేన అధ్యక్షుడిని నిర్మాతైనా ఎన్. సుధాకర్ రెడ్డి నితిన్ తండ్రి కలిసి పవన్ ని పరామర్శించారు. ఆరోగ్యం గూర్చి తెలుసుకొని ఎన్నికల ఖర్చు నిమిత్తమై 25 లక్షల రూపాయల చెక్ ను అందచేశారు. నితిన్ చేతనైన సాయం చేసి వీరాభిమానాన్ని చాటుకున్నాడు.

ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ మాట్లాడుతూ..’నితిన్ నా హెల్త్ గురుంచి వాకబు చేసినందుకు, నా మీద అభిమానం చూపించటమే కాకుండా పార్టీ కి ఫండ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు నితిన్ కు, సుధాకర్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు’ అని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.