మదర్స్ డే రోజు నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావ్ : థాంక్యూ ఆకాశ్ – నీతా అంబానీ

0
60
మదర్స్ డే రోజు నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావ్ : థాంక్యూ ఆకాశ్ - నీతా అంబానీ
మదర్స్ డే రోజు నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావ్ : థాంక్యూ ఆకాశ్ - నీతా అంబానీ

IPL సీజన్ 12ను ముంబయి ఇండియన్స్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.. చివరి బంతి వరకు ఎంతో ఉత్కంట భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో.. ఒక్క పరుగు తేడాతో చెన్నై పై ముంబయి విజయం సాదించింది. ఈ విజయం సమయంలో ముంబయి ఇండియన్స్ జట్టు యజమానురాలైన “నీతా అంబానీ” ఎంత భయపడ్డారో తెలిసిందే. ఎక్కడ IPL కప్పు చేజారిపోతుందో అనే ఆమె భయాన్ని క్షణాల్లో దూరం చేశాడు మలింగ. చివరి బంతికి వికెట్ తీసి ముంబయి జట్టుకు చరిత్రలో మర్చిపోలేని విజయాన్ని అందించాడు మలింగ.

ఈ విజయం ముంబయి ఆటగాళ్లలో ఊహించని ఆనందాన్ని, ఉస్తాహాన్ని నింపింది అన్నది ఒకెత్తయితే.. ఆ జట్టు యజమానురాలు “నీతా అంబానీ” ఆనందం మరో ఎత్తు. అంబానీ కుటుంబం వ్యాపారంలో ఇప్పటివరకు సక్సెస్ లు తప్ప పెద్దగా ఓటములు చూడలేదు. IPL చరిత్రలో కూడా అంతే.. ఇప్పటివరకు నాలుగుసార్లు టైటిల్ గెలుచుకున్న ఏకైక జట్టుగా ఒక ముంబయి ఇండియన్స్ మాత్రమే నిలిచింది. పైగా ఇప్పటివరకు 100 మ్యాచ్ లు గెలిచిన మొదటి జట్టుగా కూడా ముంబయి ఇండియన్స్ నిలవడం విశేషం.

ఇలాంటి ఆనంద సమయంలో సరిగ్గా “మదర్స్ డే” రోజున ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ సీజన్ 12 టైటిల్ గెలవడంతో నీతా అంబానీ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఈ ఆనందానికి కారణం అయిన తన తనయుడు ఆకాశ్ అంబానికి సోషల్ మీడియా వేదికగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “మదర్స్ డే సందర్భంగా ఏకంగా ఐపీఎల్ టైటిల్ నే కానుకగా ఇచ్చావు… థాంక్యూ ఆకాశ్” అంటూ ఆమె మురిసిపోయారు.