వడ్డీ వసూళ్ళలో సూర్య..!

0
97
Ngk lyrical song

డ్రీమ్ వారియార్ పిక్చర్స్ పతాకం పై , శ్రీ రాఘవ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘ఎన్జికే’ నంద గోపాల్ కృష్ణ . ఈ సినిమాలో సూర్య కథానాయకుడిగా, సూర్య సరసన రకుల్ ప్రీత్ , పింపుల్ పిల్ల సాయి పల్లవి నటిస్తున్నారు. పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు , తమిళ రెండు భాషల్లో మే 31 వ తేదీన విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి తాజాగా లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘వడ్డీలోడు వచ్చానే.. గడ్డి కోసం చూసేనే.. అడ్డమైన మాటలే .. అడ్డే లేక వాగేనే .. సీత కొక ఈడ .. ఉసరవెల్లిగా మారే..’ అనే కొనసాగుతున్న పాటలో సూర్య డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. సత్యన్ ఆలపించిన ఈ పాట ఎంతో ఆకర్షణీయంగా నిలిచింది.. ఈ పాట లో సూర్య ఏంటో మీకు అర్థమైందనుకుంటా.. వడ్డీ కి డబ్బులు తీసుకునే వాడుగా, మరో వైపు రాజకీయ పరంగా తన పాత్ర ఏంటో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.