జ‌గ‌న్ ఆస్తుల కేసులో కొత్త ట్విస్ట్‌..! మ‌ళ్లీ మొద‌టికే..?

0
507

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆస్తుల కేసులో మ‌రో కొత్త ట్విస్ట్ నెల‌కొంది. అయితే, వైఎస్ జ‌గ‌న్ కు సంబంధించిన ఆస్తుల‌పై సీబీఐ విచార‌ణ జ‌రుపుతున్న సంగ‌తి తెలిసిందే. నాంప‌ల్లి సీబీఐ కోర్టులో జ‌గ‌న్ ఆస్తుల‌పై విచార‌ణ కొన‌సాగుతుండ‌గా, న్యాయ‌మూర్తి వెంక‌ట ర‌మ‌ణ వాద‌న‌లు, ప్ర‌తివాద‌న‌ల‌ను వింటున్నారు.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న కావ‌డంతో న్యాయ‌మూర్తి వెంక‌ట‌ర‌మ‌ణ ఏపీకి బ‌దిలీపై వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కొత్త జ‌డ్జీ రావాల్సి ఉంది. దీంతో జ‌గ‌న్ ఆస్తుల‌పై విచార‌ణ మ‌ళ్లీ మొద‌టికొచ్చే అవ‌కాశం ఉంద‌ని సోష‌ల్ మీడియాలో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. సీబీఐ విచార‌ణ‌లో భాగంగా ఇవాళ కోర్టుకు హాజ‌రైన వైఎస్ జ‌గ‌న్ న్యాయ‌మూర్తి లేక‌పోవ‌డంతో వెనుదిరిగారు.