నమ్రత నచ్చడం లేదట.!

0
70

యస్. నమ్రత నచ్చడం లేదట మన సోషల్ మీడియా జనాలకి. ఎందుకంటే ఆమె మేకప్ లేకుండా పార్టీ లకు వెళ్తుంటే వాళ్ళు చూడలేకపోతున్నారట. ఇంతకీ ఈ సందర్భం ఏమిటంటే.. మహేశ్ బాబు ‘మహర్షి’ మూవీ టీమ్.. అంటే, హీరో మహేశ్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫ్యామిలీలు పార్టీ చేసుకున్నాయి.

ఇందుకు సంబంధించిన ఫొటోలను మహేశ్ భార్య నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పార్టీకి నమ్రత మేకప్ వేసుకోకుండా రావడమే  కొంతమంది మహేశ్ ఫాన్స్ కి నచ్చలేదట. దీంతో నమ్రతా ఎందుకు మేకప్‌ వేసుకోవు అంటూ కొందరంటే, గౌరవ్ అనే మరొక అభిమాని ఇంకాస్త ముందుకెళ్లి ఏదైనా ఫోబియాతో బాధ పడుతున్నావా? లేదా డిప్రెషన్‌ లో ఉన్నావా అని వ్యాఖ్యానించాడు.

దీంతో నమ్రతకి మండింది. ‘మిస్టర్ గౌరవ్, మేకప్‌ వేసుకున్న మహిళలనే నువ్వు ప్రేమిస్తావనుకుంటా. ఇకపై నీ ఆలోచనా విధానానికి సరిపోయే వాళ్లనే ఫాలో అవ్వు. ఓకేనా?. అలా అయితేనే ఇలాంటివి చూడకుండా ఉండగలవు! నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్నది నా సిన్సియర్‌ రిక్వెస్ట్‌’ అని ఘాటు ఆన్సర్ ఇచ్చింది.

నమ్రత ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. భర్త మహేశ్ కు లేని బాధ మీకెందుకంటూ మరికొందరు
కామెంట్లు పెడుతున్నారు.