నయీం గ్యాంగ్ లో ఐదుగురు అరెస్ట్ : లిస్ట్ లో పాశం శ్రీను కూడా

0
231
నయీం గ్యాంగ్ లో ఐదుగురు అరెస్ట్ : లిస్ట్ లో పాశం శ్రీను కూడా
నయీం గ్యాంగ్ లో ఐదుగురు అరెస్ట్ : లిస్ట్ లో పాశం శ్రీను కూడా

గ్యాంగ్‌ స్టర్‌ “నయీం” కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు తెలంగాణ పోలీసులు. ఇలాంటి సమయంలో “నయీం గ్యాంగ్” సైలెంట్ గా తలదాచుకోవాల్సింది పోయి పబ్లిక్ గా తప్పులు చేస్తూ పోలీసుల చేతికి చిక్కారు. “నయీం గ్యాంగ్” ప్రధాన అనుచరుల్లో ఒకరైన “పాశం శ్రీను”తో పాటు మరో 5 మందిని రాచకొండ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. “నయీం” బినామీ ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసేందుకు వీరు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గ్యాంగ్‌ స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ కు ముందు, ఆ తర్వాత చాలా మంది ప్రజలు నయీం గ్యాంగ్‌ తమ భూములను అక్రమంగా ఆక్రమించుకుందని భువనగిరి పట్టణంలో “సిట్‌”కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇది వరకే పాశం శ్రీను, ఇతర నయీం అనుచరులు జైలుకు వెళ్ళి శిక్ష అనుభవించి వచ్చారు. అయిన వీరిలో మార్పు రాలేదు అందులో బాగంగా ఇటీవల బినామీ భూములను అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేసేందుకు యత్నించారు. దీంతో ఈ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.