విశాఖను స్మార్ట్ సిటీ మార్చింది ఎవరో కాదు మేము : విశాఖలో మోడి

0
165
narendra modi speech in visakhapatnam today
narendra modi speech in visakhapatnam today

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుకున్నట్లుగానే విశాఖ భయిరంగా సభ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడి చంద్రబాబును టార్గెట్ చేశాడు. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోడీ ఈసారి మరింత ఎక్కువ చేసు తెలుగులో మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చాడు. విశాఖపట్టణం ప్రజలకు శుభవార్త తీసుకొని వచ్చా.. మీ ప్రాంతంలో అతి త్వరలోనే “రైల్వే జోన్” ఏర్పాటుకు అన్ని పనులు ప్రారంభం అయ్యాయి అని శుభవార్త చెప్పాడు ప్రధాని నరేంద్ర మోడీ.

ఇక్కడ ఉన్న కొందరు యుటర్న్ నేతలు నన్ను ప్రధాని పదవి నుండి దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేను చేసిన తప్పులు ఏంటి ? నిజాయితీగా పనిచేస్తున్న నాపై విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటి ?. కేవలం నాపై గెలవడానికి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారితో చేతులు కలపడం ఎంత వరకు నిజమో ఒక్కసారి ఆలోచించండి.

మీలాంటి అవినీతిపరులు, కుటుంబ పాలనలు చేసేవారి సమయం అయిపోయింది. ఇక మీ ఆటలు సాగవు అని చెప్పిన మోడీ.. ఇప్పటివరకు విశాఖను అన్నివిదాలుగా ఆదుకుంన్నది ఒక BJP ప్రభుత్వమే.. మేము చేసిన అభివృద్దే ఇప్పుడు విశాఖపట్టణం స్మార్ట్ సిటిగా మారిందనే విషయాన్ని మర్చిపోవద్దు అని చంద్రబాబుకు కౌంటర్ వేశారు ప్రధాని మోడీ