జగన్ ప్రభుత్వంలో మాజీమంత్రి లోకేష్ కు కొలువు..!

0
573

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో మాజీ మంత్రి నారా లోకేష్‌కు కీల‌క ప‌ద‌వి ల‌భించింది. కాగా, ప్ర‌స్తుతం ఎమ్మెల్సీలుగా కొన‌సాగుతున్న స‌భ్యులు త‌మ జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్స్ అఫిషియో మెంబ‌ర్‌గా నియ‌మించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్న నారా లోకేష్ కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఎక్స్ అఫిషియో మెంబ‌ర్‌గా నియ‌మితులు కానున్నారు. ఇప్ప‌టికే మంగ‌ళ‌గిరి మున్సిపాలిటీ ఎక్స్ అఫిషియో మెంబ‌ర్‌గా నారా లోకేష్‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం నియ‌మించ‌డంతోపాటు ఈ నెల 23న జ‌ర‌గ‌నున్న జిల్లా ప‌రిష‌త్ సమావేశానికి హాజ‌రు కావాల‌ని అధికారుల ద్వారా స‌మాచారం అంద‌జేసింది.